మహేష్ కోసం మరో కథ రెడీ.. ఈ డైరెక్టర్ మహేష్ ను ఇప్పట్లో వదిలేలా లేడుగా.. ?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య స్నేహం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పితే ఎవరితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడు. అంతేకాదు ఇండస్ట్రీలో కేవలం అతి కొద్దిమంది సినీ ప్రముఖులతో మాత్రమే మహేష్ తరచుగా కాంటాక్ట్ లో ఉంటాడు.అలాంటి అతికొద్దిమంది సినీ ప్రముఖుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో కూడా ఈ ఇద్దరూ కలిసి దర్శనమిచ్చారు. అయితే మహేష్ బాబు తో వంశీ పైడిపల్లి చేసింది ఒక్క సినిమానే. అదే మహర్షి. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు కష్టపడ్డాడు వంశీ. 

అయితే ఈ సినిమా జనాలను పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే సినిమా నష్టాలను మిగల్చకుండా సేవ్ చేసింది సేవ్ చేసింది. కానీ మహేష్ బాబు వంశీ పైడిపల్లిని అప్పటి నుంచి ఇప్పటి వరకు వదలడం లేదు. మహేష్ ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళినా కూడా అక్కడ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఉండాల్సిందే. అయితే వంశీ పైడిపల్లి ఇప్పుడు మహేష్ కోసం మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. నిజానికి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రావాల్సిందే. కానీ వంశీ పైడిపల్లి వినిపించిన కథ మహేష్ కి రొటీన్ గా అనిపించడం వల్ల వీరి కలయికలో సినిమా సెట్ అవ్వలేదు.

దాంతో వంశీ కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే లాక్డౌన్ టైంలోనే వంశీ మహేష్ కోసం మరో కథను సిద్దం చేశాడట. అయితే ఈసారి వంశీ చెప్పిన ఐడియా నచ్చడంతో మహేష్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి విజయ్ తో సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే ఆ తర్వాత మహేష్.. వంశీ పైడిపల్లి తోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: