రవితేజ తెలివిగా చేస్తున్నాడే..!!

P.Nishanth Kumar
రవితేజ హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. భారీ పారితోషికం అందుకుంటూ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను సాధించి కుంటూ రవితేజ ఎంతో తెలివిగా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే తన ఇమేజ్ తో తన కష్టంతో ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రేక్షకులను అలరించడం ధ్యేయం గా పెట్టుకుని ఇప్పుడు ఇంతటి స్థాయికి వచ్చాడు. అలా రవితేజ భారీ క్రేజ్ సంపాదించి స్టార్ హీరో గా ఎదిగాడు.

అయితే డిస్కో రాజా చిత్రం తర్వాత ఆయన నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవడం తో రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయం పట్ల ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఏ ఒక్క సినిమాలో కూడా స్టార్ హీరోయిన్ ను పెట్టుకొకపోవడం ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కొంతమంది దర్శకులు, హీరోలు తమ సినిమాల్లో స్టార్ హీరోయిన్లను పెట్టుకుంటే కలిసి వస్తుందని భావించి పెద్ద హీరోయిన్ లతోనే సినిమాలు చేస్తారు.

కానీ రవితేజ మాత్రం యువ హీరోయిన్లకు మత్రమే ఛాన్స్ లు ఇస్తున్నాడు. అలా ఇప్పుడు ఆయన చేస్తున్న ఖిలాడి సినిమా ద్వారా మీనాక్షి చౌదరి అలాగే డింపుల్ హయాతి అనే ఇద్దరు ముద్దుగుమ్మలు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రామారావు చిత్రానికి కూడా చిన్న హీరోయిన్ లనే ఎంపిక చేసుకున్నాడు. దివ్యాంశ కౌశిక్ అనే హీరోయిన్ అలాగే రశిక విజయ అనే హీరోయిన్ లను ఎంపిక చేసుకున్నాడు. మరి రావణాసుర మరియు ధమాకా చిత్రాలకు కూడా ఆయన ఏ రేంజ్ హీరోయిన్ లను ఎంచుకుంటాడో చూడాలి.  ఏదేమైనా తన ఇమేజ్ తోనే సినిమాలను ఆడాలనే హీరోయిన్ల ను చిన్నవారినీ పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు రవితేజ.  మరి ఈ సినిమాలతో ఏ స్థాయి విజయం అనుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: