నాగార్జున ఎంత దగ్గరయితే అలా చేయాలా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కరోనా ఒక విధమైన ఇబ్బంది పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక రకమైన ఇబ్బంది పెడుతుంది. కక్షపూరిత వ్యవహారంగా అక్కడి ప్రభుత్వం టాలీవుడ్ సినిమా టికెట్ ల ధరను తగ్గించి భారీ నష్టం వచ్చేలా చేకూరుస్తుంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా నష్టపోయిన చిత్రబృందం ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయేలా చేస్తుంది జగన్ ప్రభుత్వం. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి దీన్ని సాల్వ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

తొందర్లోనే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ పెద్దలు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో భారీ వసూళ్లను సంపాదించుకుని మంచి హిట్ అందుకున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి భారీగా గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఈ సంక్రాంతి సీజన్ లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే నాగార్జున ధైర్యం చేసి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. తీసుకురావడం అయితే తీసుకు వచ్చాడు కానీ ఏపీలో ఎలాంటి వసూళ్లను సాధించుకుంటాడు అనే అనుమానాలు అందరిలో రేకెత్తాయి.

అయితే అనూహ్యంగా ఏపీలో బంగార్రాజు సినిమా కి టికెట్ ధర విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకలేదట. నార్మల్ ధరలకే అక్కడ సినిమా టిక్కెట్లు విక్రయం అయ్యాయని తెలుస్తుంది. అంతేకాదు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ విధంగానే టికెట్లు అమ్ముడు అయ్యాయట. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో వచ్చిన సినిమాలకు భారీగా నష్టం కావడం జరిగింది. ఎందుకు నాగార్జున సినిమా విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది అని ఇప్పుడు కొంతమంది సినిమా వారు చెబుతున్నారు. నాగార్జున వైసిపి పార్టీ కి ఎంత దగ్గరైతే మాత్రం ఇలా వారికే సపోర్ట్ చేయాలా మిగతా వారు సినిమా వారు కాదా అని కొంతమంది నాగార్జున ను సైతం విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: