టాప్ యాంకర్.. ఈ నీచ బుద్ధి ఏందయ్యా..?

shami
అతనొక టాప్ యాంకర్.. ఆయన చేసే షోలకు అతగాడి పక్కన ఖచ్చితంగా ఓ లేడీ యాంకర్ ఉండాల్సిందే. చేస్తున్న యాంకర్లతో పులిహోర కలపడంలో అతను చాలా ఫేమస్. బుల్లితెర మీద తనకు తిరిగులేదు.. తనని ఎదురించే దమ్ము ఎవడికి లేదన్న ధైర్యం బాగా ఉంది. యాంకర్ గా ప్రతిభ ఉన్నా అతను చేసే అతి అతన్ని నెంబర్ 1 స్థానానికి దూరం పెట్టింది. ఈమధ్య ఆ తోపు యాంకర్ ఓ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. కొన్నాళ్లు ఒక ఇంట్లో ఉండి ఫైనల్ గా టైటిల్ గెలవడమే ఆ షో కాన్సెప్ట్.
అయితే తానో టాప్ యాంకర్.. బుల్లితెర మీద తనకు తిరుగులేదు. తను కాకుంటే ఆ టైటిల్ ఇంకెవరికి గెలిచే రైట్ ఉందని అనుకున్న అతడికి ఆడియెన్స్ షాక్ ఇచ్చారు. ఆ షో కోసం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ స్పెషల్ రివ్యూస్ ఇస్తుంటాయి. టైటిల్ గెలుస్తాడని అనుకున్న అతను టాప్ 5లో కూడా ఉండకుండా బయటకు వచ్చేసరికి షాక్ అయ్యాడు. బయటకు వచ్చాక తన పనేదో తాను చూసుకోకుండా అక్కడ ఆడటం చేత కాక వచ్చి తన మీద నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన వారి మీద పడ్డాడు. తన టీం తో యూట్యూబర్స్ ని బెదిరించి వారితో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడట. కొందరు అతనితో మ్యాటర్ క్లోజ్ చేసుకుంటే.. కొందరు మాత్రం అతనో తోపు యాంకర్ అయితే మాకేంటి తాము ఇచ్చిన రివ్యూస్ కరెక్టే అని చెప్పారట.
అయితే వారిని అలా వదిలేయాల్సింది పోయి వారి యూట్యూబ్ ఛానెల్స్ పై స్ట్రైక్స్ వేయించడం.. తన టీం తో ఆ ఛానెల్స్ ని హ్యాక్ చేయించడమే కాకుండా యూట్యూబ్ ఛానెల్ ని సైతం డిలీట్ చేయించాడట. ఆ షో నడుస్తున్న టైం లో పగలు రేయి అని చూడకుండా కష్టపడ్డ ఆ యూట్యూబర్స్ కి తమ ఛానెల్ డిలీట్ చేసే సరికి రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. వాళ్లని సాధించడానికే ఆ యాంకర్ ఇలా డ్రామాలు ఆడుతున్నట్టు టాక్. హ్యాక్ చేసి డేటా హోల్డ్ లో పెట్టారట. మళ్లీ మ్యాటర్ మాటల్లో క్లోజ్ అయితే యూట్యూబర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చి వారి ఛానెల్స్ వారికి తిరిగి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఆ ఛానెల్స్ వాళ్లకి రాకపోతే మాత్రం ఆ టాప్ యాంకర్ పై ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నారు యూట్యూబర్స్. ఇన్నాళ్లు మీడియా చాటుల జరిగిన ఈ తతంగం అంతా బట్టబయలు చేసి ఆ టాప్ యాంకర్ అసలు రంగు బయట పెట్టాలని చూస్తున్నారు యూట్యూబర్స్. టాప్ యాంకర్ గా ఉంటూ అతను చేస్తున్న ఈ పనులు.. నీచ బుద్ధిని చూసి అతన్ని మెచ్చే ఆడియెన్స్ కూడా ఛీ కొట్టేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: