అయ్యో :మహేష్ ముఖంలో ఆ నవ్వు మాయమైందిగా...?

murali krishna
ఎప్పుడు ఆనందంగా ఉండడమే తన గ్లామర్ రహస్యమని మహేష్ బాబు చాలా సందర్భాలలో చెప్పారు. మహేష్ స్మైల్ కు అభిమానులు అంతలా ఫిదా అయిపోతారు మరి , ఇక లేడీ ఫ్యాన్స్ విషయమైతే చెప్పనవసరమే లేదుగా.
అంతలా సూపర్ స్టార్ తన స్మైలింగ్ ఫేస్ తో అందరిని కూడా కట్టి పడేస్తారు.కానీ ఇపుడు ఆ చిరునవ్వే మహేష్ ముఖంలో మిస్ అయ్యిందని తెలుస్తుంది. సూపర్ స్టార్ మేనల్లుడు గల్లా అశోక్ వెండితెరకు పరిచయం అవుతోన్న సినిమా "హీరో" సంక్రాంతి సందర్భంగా శనివారం నాడు విడుదల అవుతోన్న నేపధ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోనుకూడా రిలీజ్ చేసారు మహేష్ బాబు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత అభిమానులకు మహేష్ కనిపించడం ఇదే తొలిసారని చెప్పవచ్చు.అలాగే తన సోదరుడు రమేష్ బాబు అకాల మరణం నుండి కోలుకున్న మహేష్ ఎలా ఉన్నాడోనని ఆశించిన అభిమానులకు, సూపర్ స్టార్ ముఖచిత్రం ఫ్యాన్స్ ఆవేదనకు కారణమవుతోందట..
"హీరో" సినిమా గురించి, అశోక్ పడ్డ కష్టం గురించి, సంక్రాంతి పండగ తమ ఫ్యామిలీకి కలిసి వచ్చే తీరు గురించి ఆయన చెప్పుకొచ్చారు గానీ, ఎక్కడా ముఖంలో ఇసుమంత సంతోషం గానీ అలాగే ఎప్పుడూ సహజంగా కనిపించే ఆ చిరునవ్వు గానీ మహేష్ లో మచ్చుకైనా కనిపించలేదు.
గల్లా జయదేవ్ అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగిన మహేష్  మేనల్లుడు సినిమా 'హీరో' రిలీజ్ అవుతుంటే శుభాకాంక్షలు తెలపడానికి వీడియో బైట్ ఇచ్చారే గానీ, రమేష్ బాబు ఉదంతం నుండి కోలుకోలేదని ఈ వీడియో చూస్తేనే స్పష్టం చేస్తోంది. మళ్ళీ ఎన్నాళ్ళకి మహేష్ లో ఆ చిరునవ్వును చూస్తామో అనుకోవడం అభిమానుల వంతయిపొయిందట.మహేష్ భాధ ఎప్పుడు తీరేనో అని ఆయన అభిమానులు సైతం కంట తడి పెడుతున్నారట. మహేష్ మళ్ళీ మాములు స్థితికి రావాలని ఆయనను బాగా అభిమానించే ప్రతి అభిమాని మనస్సు కోరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: