ఆఫర్ల కోసం హీరోయిన్లు ఆ పనికి ఒప్పేసుకుంటున్నారు.!

NAGARJUNA NAKKA
తమన్నకి స్టార్ హీరోస్‌ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి. థర్టీ ప్లస్‌లో ఉందని, కుర్ర హీరోలు మిల్కీని పక్కన పెడుతున్నారు. దీంతో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది తమన్న. చిరంజీవితో 'భోళాశంకర్', వెంకటేశ్‌తో 'ఎఫ్3' సినిమాలు చేస్తోంది. అయితే రెజీనాకి తెలుగులో 'జ్యో అచ్యుతానంద' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. డిజాస్టర్స్‌తో రెజీనా జర్నీకి బ్రేకులు పడ్డాయి. మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైమ్‌లో 'ఎవరు' సినిమాలో నెగటివ్‌ రోల్‌ కూడా ప్లే చేసింది. విశాల్‌ 'చక్ర' సినిమాలో కూడా విలన్‌గా చేసింది. అయినా హీరోయిన్‌ రోల్స్‌ రావడం లేదు. తెలుగు ఆడియన్స్‌ అంతా మర్చిపోతోన్న టైమ్‌లో 'ఆచార్య'లో సానా కష్టం అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది రెజీనా. 'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ హిట్‌ కొట్టింది ఫరియా అబ్దుల్లా. క్యూట్‌ యాక్టింగ్‌తో రోబో చిట్టి కంటే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. బాలీవుడ్‌ నుంచి ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం జరిగింది. అయితే కెరీర్‌ బిగినింగ్‌లోనే ఫరియా స్పెషల్‌ సాంగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది. 'బంగార్రాజు' సినిమాలో వాసివాడి తస్సాదియ్యా అంటూ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది ఫరియా. {{RelevantDataTitle}}