పడిలేచిన శృతిహాసన్ కెరియర్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల స్థానానికి చేరుకుంది. శృతి హాసన్ టాలీవుడ్ తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు భాష విషయానికి వస్తే శ్రీమంతుడు సినిమా వరకు అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను అందుకోలేకపోయింది.

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు సినిమాలు రెండూ కూడా అపజయాలు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ కాస్త డీలా పడిపోయింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఇలా ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో మళ్లీ శృతి హాసన్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం శృతి హాసన్, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుంది.  ఇలా శృతి హాసన్ కెరియర్ లో అపజయాలు ఎదురు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని అంతే దీటుగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: