కాజల్ అగర్వాల్, ఛార్మీ కౌర్.. వీరిద్దరి మధ్య సంబంధం ఏంటీ..? బంధువులు అవుతారా? లేక క్లాస్ మేట్సా? ఇలా పైన టైటిల్ చూడగానే ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదిలే ఉంటాయి. వాటికి సమాధానాలు దొరకాలంటే ఏ మాత్రం లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో కొనసాగుతున్న టాప్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. మరోవైపు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ భామ.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో పెళ్లి పీటలెక్కి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
పెళ్లి తర్వాత కెరీర్‌ను బాగానే రాణిస్తూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న కాజల్.. త్వరలోనే తల్లి కూడా కాబోతోంది. ఛార్మీ విషయానికి వస్తే.. `నీతోడు కావాలి` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఎన్నో హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాక వల్ల అవకాశాలు తగ్గిపోవడంతో.. నిర్మాతగా మారిన ఛార్మీ ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.
ఇక కాజల్, ఛార్మీలకి సంబంధం ఏంటీ అంటే.. కాజల్ కెరీర్లో తొలి హిట్ చిత్రం `చందమామ`. నవదీప్, శివ బాలాజీ హీరోలుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సింధూ మీనన్ మరో హీరోయిన్గా నటించింది. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కాజల్‌కు మరిన్ని అవకాశాలు కూడా దక్కయి.
అయితే చందమామ సినిమాలో కాజల్‌కి డబ్బంగ్ చెప్పింది ఎవరో కాదు ఛార్మీనే. కాజల్‌కి తెలుగు రాదన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు ఛార్మీ చేత డబ్బింగ్ చెప్పించారు. ఈ క్రమంలోనే కాజల్‌కి, ఛార్మీతో మంచి సన్నిహిత్యం ఏర్పడింది.