ఆ హాట్ బ్యూటీని సచ్చిపోమ్మంటున్న నెటిజన్స్..
ఇక ఆ తర్వాత బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం సమయంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడి మరోసారి నెటిజన్స్ కి ఫుల్ స్టఫ్ గా మారింది. మొదటినుంచి కూడా నెటిజన్లు స్వరాని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా తనకు కరోనా వచ్చిందని స్వరా సోషల్ మీడియా వేదికగా చెబితే.. 'అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్' అని నెటిజన్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో 'త్వరగా చచ్చిపో.. నీకు నరకంలో కూడా ప్లేస్ ఉండదు' అని దారుణంగా పోస్ట్ లు పెడుతుండగా..'నువ్వు కరోనాతో సచ్చిపోతే చాలా మేలు, భూమికి పట్టిన పీడ అనేది విరగడవుతుందంటూ' అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన స్వరా భాస్కర్ ఆ పోస్ట్ లన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వారందరికీ తాను తిండి పెడుతున్నానని ఇంకా కేవలం తనని ట్రోలింగ్ చేస్తూ ఇలాంటి వారంతా పొట్టపోసుకుంటున్నారని కామెంట్ చేసింది. తనకు ఏమైనా జరిగిందంటే మీ జీవనాధారాన్ని కోల్పోతారని.. సో బ్రతకాలని కోరుకోండి అంటూ స్వరా సెటైర్లు వేసింది.