సుకుమార్ పై మణిరత్నం కి ఎందుకు కోపం..?

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒక సమయంలో పరాభవాలు అనేవి తప్పవు. అది దర్శకుడు కావచ్చు, నిర్మాతగా హీరోగా వచ్చు, ఎవరైనా కావచ్చు. అలా టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే సుకుమార్ కు కూడా ఇటీవలే అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే.. దేశంలో అగ్ర దర్శకుడిగా పేరు ఉన్న అతి కొద్ది మంది దర్శకులు మణిరత్నం ఒకరు. అలాంటి దర్శకుడి చేతిలో సుకుమార్ కి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 తను దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో మణిరత్నం తీరుతో బాధ పడ్డాను అంటూ ఓ చేదు అనుభవం గురించి పంచుకున్నారు. థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసినట్టు అనిపించింది. వాస్తవానికి మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి ప్రభావంతోనే తను దర్శకుడిగా మారను అని అన్నాడు. ఈ క్రమంలోనే ఆర్య సినిమా తర్వాత ముంబైలో ఓ సారి మణిరత్నం ని కనిపిస్తే ఆయన్ని మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఆ సమయంలో నటి శోభన తో సీరియస్ డిస్కషన్ జరుగుతోందని చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత సార్ అంటూ దగ్గరికి వెళ్లాను. అప్పుడు ఆయన కోపంగా చూస్తూ వెళ్ళు అంటూ చేత్తో సైగ చేశారు అని అది తను చాలా బాధపెట్టింది అని అన్నాడు.

 సుకుమార్ తాను ఎంతగానో అభిమానించే ఓ దర్శకుడు ఇలా చేయడం చాలా బాధగా అనిపించింది అన్నాడు సుకుమార్. ఒక దర్శకుడు సీరియస్ గా గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ తర్వాత నాకు అర్థం అయింది అని అన్నాడు. అంతే కాదు ఇప్పటికీ తను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు సుకుమార్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: