సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కానీ హీరోలు ఎవరో తెలుసా..?

Anilkumar
సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుండి అనేకమైన నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.అయితే వచ్చిన వారంతా సినిమా రంగంలో రాణించాలి అనే రూల్ ఏమీ లేదు.  కొంతమంది హీరోల వారసులు గా వచ్చారు మరి కొందరు దర్శకుల వారసులుగా కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అందరూ కాకుండా అందరిలో కొందరు మాత్రం హీరోగా వారిని వారు నిరూపించుకున్నారు.సినిమా రంగంలో రాణించాలి అంటే సినిమా బ్యాగ్రౌండ్ ఒకటే ఉంటే చాలాదు. వారిని వారు నిరూపించుకునేల  వారి దగ్గర మంచి నటన కూడా ఉండాలి. వచ్చిన అవకాశాలలో 1,2 సినిమాలలో వారి నటన ఏంటో చూపించాలి.

 ఇక ఆ సినీ బ్యాగ్రౌండ్ ఉండి సక్సెస్ కాలేకపోయిన సినీతారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..అయితే ఒకప్పటి విప్లవ సినిమాల దర్శకుడు టి కృష్ణ కొడుకు గోపీచంద్. గోపీచంద్ మొదట్లో ఎంతో కష్టపడి మొదట చేసిన కూడా తరువాత తరువాత హీరోగా సినీరంగంలో రాణించాడు. ఎందరికో మంచి మంచి హిట్ సినిమాలను అందించాడు దర్శకుడు రాఘవేంద్రరావు అయితే తన కొడుకు మాత్రం సక్సెస్ కాలేదు. ఆయనే కాకుండా  దాసరి నారాయణరావు సైతం పలువురితో గొప్ప సినిమాలు చేశాడు. తన కొడుకకు అరుణ్ కుమార్ మాత్రం మంచి హీరోగా ఎదగలేకపోయాడు.  ఇకపోతే అప్పట్లో  టాప్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి సైతం తన కొడుకు వైభన్ సినిమాల్లోకి  తీసుకు వచ్చాడు.

కానీ ఆయన కూడా టాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. ఇక వీరితో పాటు దర్శకుడు ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ సినిమాల్లోకి వచ్చాడు. ఇక ఈయన కూడా ఏ మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఇకపోతే ఈవీవీ తనయుడు అల్లరి నరేష్ సక్సెస్ అయ్యేందుకు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.అన్న ఆర్యన్ రాజేష్ సైతం అంతగా సక్సెస్ కాలేదు. వీరే కాకుండా  ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది హీరోగా పలు సినిమాలు  చేసాడు. కానీ ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు.శ్రీసింహా కీరవాణి కొడుకు  కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఇక వీరితో పాటు దర్శకుడు పూరీ తన కొడుకు ఆకాశ్ ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: