డబ్బింగ్ వర్సెస్ డైరెక్ట్.. ఏవి విజయాలు అందుకుంటాయో!!

P.Nishanth Kumar
సంక్రాంతి కానుకగా తెలుగులో నిర్మితమైన చిత్రాలే కాకుండా కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఆ విధంగా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే డబ్బింగ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై సినిమా సంక్రాంతికి జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ స్టార్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.  మొదట ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావించారు.

అయితే పాన్ ఇండియా సినిమాల విడుదలలు పోస్ట్పోన్ కావడంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది.  మరి ఇప్పటికే ఈ సినిమా యొక్క అప్డేట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రబృందం సినిమాతో ఏ రేంజ్ లో అలరించి హిట్ అందుకుంటుందో చూడాలి. ఇకపోతే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరొక డబ్బింగ్ సినిమా విశాల్ హీరోగా నటించిన సామాన్యుడు. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకొని వినూత్నమైన సినిమాలను చేస్తాడు అని పేరు దక్కించుకున్న విశాల్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ స్థాయిలో విజయం అందుకుంటాడో చూడాలి. 

తన వరుస చిత్రాల విడుదల తో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన కురుప్ సినిమా తెలుగులో విడులై మంచి హిట్ కాగా ఇపుడు తెలుగులో ఆయన నటించిన మరొక సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు సినిమా నిర్మాతలు. సెల్యూట్ అనే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేసి ఇక్కడ తన మార్కెట్ ను పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రేంజిలో విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: