డ్యూయల్ రోల్ లో మరోసారి మెప్పించిన బాలకృష్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి, అలా డ్యూయల్ రోల్ లో అలరించిన సినిమాలలో బాలకృష్ణ సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా సినిమాలలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. అలా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో అఖండ ఒకటి.  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో పూర్ణ నటించింది. ఇదివరకే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రాగ వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఎన్నో అంచనాల నడుమ 2 డిసెంబర్ 2021 లో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా దియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పాత్రలో రైతు గా మరొక పాత్రలో అగోరా గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదివరకే ఎన్నోసార్లు డ్యూయల్ రోల్ లో కనిపించి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న బాలకృష్ణ కు అఖండ సినిమా మరొక విషయాన్ని తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: