దర్శకుడు దాసరిని అవమానించిన ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో నటుడిగా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. రాజకీయ నాయకుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీ లో ఉండే 24 క్రాఫ్ట్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని దాసరి నారాయణరావు సొంతం చేసుకున్నారు. అలనాటి స్టార్ హీరో ఎన్టీఆర్ ,ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోల ను కూడా సినీ ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థానానికి చేర్చిన ఘనత కూడా దాసరికే దక్కింది. అంతేకాదు.. చ్చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన దర్శకుడిగా 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఇండస్ట్రీ రికార్డు కొల్లగొట్టిన ఈయన ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు.
ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న దాసరి నారాయణరావు అనుకోకుండా కొన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. దాసరి ఒక్క ఆర్టిస్టు అవమానించారంట. ఆయన అంతలా అవమానపడ్డా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నవ్వుతూ సినీ ఇండస్ట్రీలో ముందడుగు వేయడం ఆయనకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి.
అంతేకాదు.. ఒక్కనొక్క సమయంలో సినిమాలో నటుడిగా ప్రవేశించిన మొదట్లో దాసరి నారాయణ రావుకు మేకప్ వేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్ రాగా.. మేకప్ సరిగా వేయండి అని అనడంతో నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ దారుణంగా అవమానించారని సమాచారం. ఆ మాటతో దాసరి సినిమాలో నటుడిగా నటించడం ఆపివేశాడు. అయితే దాసరి స్వర్గం నరకం అనే సినిమాను కొత్తవాళ్లతో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సినిమాలో ఆచార్య అనే ఒక పాత్ర చాలా ప్రత్యేకమైంది.
కాగా.. ఆ చిత్రంలో ఆ పాత్రకు సరైన నటులు ఎవరు దొరకకపోవడంతో అక్కడున్న వాళ్లంతా దాసరిని ఆ పాత్ర వేయాలని అడిగారంట. అయితే ఆయనకు ఒకసారి మేకప్ మెన్ అన్న మాటలు గుర్తుకు వచ్చి నటుడిగా నటించాలనే కోరిక చచ్చిపోయిందని చెప్పుకొచ్చారంట. ఆ మాట విన్నవారంతా బలవంతం పెట్టడంతో ఆచార్య పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. దాసరికి మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: