వామ్మో : మళ్ళి మహేష్ మూవీకి టెండర్ పెట్టట్లేదుగా జక్కన్నా .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట పై ఆయన ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. మహేష్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని పరశురామ్ పెట్ల తీస్తుండగా దీనిని భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఒక వడ్డీ వ్యాపారిగా ఈ సినిమాలో మాస్ పాత్ర లో కనిపించనున్నారని అలానే కీర్తి ఇందులో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ పాత్ర చేస్తోందని సమాచారం.
ఇక ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి అందరిలో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. అయితే విషయం ఏమిటంటే వాస్తవానికి ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే మధ్యలో తమ సినిమాని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు హఠాత్తుగా ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించడంతో, అంతటి భారీ పాన్ ఇండియా మూవీకి అడ్డంకి కాకూడదని మహేష్ తన సర్కారు వారి పాట ని ఏప్రిల్ కి వాయిదా వేశారు. కాగా ఈ విషయాన్ని ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో రాజమౌళి వెల్లడించి మహేష్ మంచితనం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పలు రాష్ట్రాల్లో థియేటర్స్ సీటింగ్ కెపాసిటీ ని 50 శాతానికి తగ్గించారు. దానితో ఒకింత ఆలోచనలో పడ్డ ఆర్ఆర్ ఆర్ టీమ్, తమ సినిమాని కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ఇంతవరకు అంతా బాగున్నప్పటికీ దీనిని ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
ఒకవేళ ఇదే కనుక జరిగితే మరొక్కసారి మహేష్ సర్కారు వారి పాట మూవీ మరికొంత కాలం వెనక్కి వెళ్ళాక తప్పదని, ఈ విధంగా మరొక్కరి మళ్ళి మహేష్ బాబుకే టెండర్ పెట్టనున్నావా జక్కన్న అంటూ రాజమౌళిని ఉద్దేశించి పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు ఇది నిజమో కాదో ఇప్పుడే చెప్పలేం అని, అలానే ఆర్.ఆర్.ఆర్ పక్కాగా ఏప్రిల్ 1నే విడుదల అవుతుంది అనేది ఇంకా ఎక్కడా న్యూస్ రాలేదని, ఇక ఈ కరోనా పరిస్థితులు పూర్తిగా సర్దుమణిగిన అనంతరమే ఆర్.ఆర్.ఆర్ యూనిట్ అధికారికంగా తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుందని, అందుకే అప్పటి వరకు ప్రేక్షకాభిమానులు అందరూ సంయమనం పాటించాలని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. దయచేసి ఇప్పటినుండే ఈ విధమైన ప్రచారాలు చేయవద్దని, తప్పకుండా మంచి టైం చూసుకుని తమ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని అటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్ కూడా చెప్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: