నాగచైతన్య బాటలో మరో స్టార్ హీరో.. భార్యతో విడాకులు?

praveen
సాధారణంగా సినిమాల్లో హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్న వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే చాలు అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి జంటలు ఎక్కడైనా కనిపిస్తే వారే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకుని అభిమానులను అలరించిన ఎన్నో ప్రేమ జంటలు విడిపోతు ఉండడం అభిమానులకు ఊహించని షాక్ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఇటీవలికాలంలో విడాకులు అంతకంటే తొందరగా జరిగిపోతున్నాయి అన్నది అర్ధమవుతుంది.

 అయితే కొంతమంది ఎన్నో ఏళ్ల పాటు వైవాహిక బంధంలో కొనసాగి ఒకరిపట్ల ఒకరు ఎంతో అభిమానాన్ని ప్రేమను చూపించుకొని ఆ తర్వాత విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక ఇలాంటి జంటల్లో ఈ ఏడాది నాగచైతన్య సమంత కూడా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరిని ఎక్కడ చూసినా అభిమానులందరూ మురిసిపోతూ వుంటారు. ఈ క్రమంలోనే సడన్గా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఇక ఇప్పటికి వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది అభిమానులకు చిక్కు ప్రశ్నగా మారి పోయింది.

 ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య తరహాలోనే మరో స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడు అన్నది తెలుస్తోంది. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఇటీవలే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. 35 ఏళ్లుగావైవాహిక బంధాన్ని కొనసాగించిన ఈ స్టార్ హీరో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా వీరికి విడాకులు మంజూరు చేసి కోర్టు. అంతేకాదు వీరి ఆస్తులకు సంబంధించి ఫైనల్ సెటిల్మెంట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యూఎస్ జర్నలిస్ట్ పత్రికలో ప్రచురితం చేశారు. ఈ స్టార్ హీరో విడాకులతో అభిమానులు షాక్ అయ్యారు. ఆర్నాల్డ్  భార్య యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మేనకోడలు.. ఇక ఆర్నాల్ట్ సినిమాల్లో వచ్చిన క్రేజ్ తో కాలిఫోర్నియా గవర్నరుగా కూడా పనిచేసారు.. అయితే వీరికి 1986లో వివాహం జరిగింది. నలుగురు సంతానం కూడా ఉన్నారు. బాడీ బిల్డర్ గా ఉంటున్న సమయంలో ఆర్నాల్డ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు  ముఖ్యంగా టెర్మినేటర్  ఈ సినిమాతో ఈయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: