ఫ్యామిలీ వెకేషన్ లో 'పుష్ప'రాజ్.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎక్కడంటే..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం 'పుష్ప': ది రైస్ ఈ సినిమా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. అయితే అల్లుఅర్జున్ ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా పూర్తయ్యే ఆఖరి నిమిషం వరకు చాలా హడావుడిగా షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఎలా ఉంటుందో అని చిత్రబృందం బాగా టెన్షన్ పడ్డారు కానీ చివరికి మాత్రం సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. ఈ గ్యాప్ లో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు మన హీరో.

సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ను ప్లాన్ చేశాడు. బన్నీ తన కుటుంబంతో విహారయాత్ర వెళ్లడం తో పాటు 2022 నూతన సంవత్సర వేడుకలను కూడా ఎంజాయ్ చేయడానికి గోవా చేరుకున్నారు. ఇక బన్నీ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక పుష్ప: ది రైజ్’ పార్ట్ 1  మంచి సక్సెస్ అందుకోవడంతో  ‘పుష్ప: ది రూల్’ అనే రెండవ భాగాన్ని తీసే పనిలో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

కాగా ఈ సినిమా సక్సెస్ పార్టీ చెన్నై మరియు హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది. సినిమా మరియు సినిమా ప్రమోషన్ లో తీసి అలసిపోయిన బన్నీ ఇప్పుడు తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక క పుష్ప పార్ట్ 2 షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ సుకుమార్ కి 100 రోజులు డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వంద రోజుల్లో పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి బన్నీ తన తదుపరి ప్రాజెక్టు ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు.పుష్ప  పార్ట్ 2 తర్వాత బోయపాటి శ్రీను తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: