ఈ అందాల ముద్దుగుమ్మ లు ఇక పెళ్లి చేసుకోరా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కాదు ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్ లు యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమా పరిశ్రమకు వచ్చి మంచి మంచి సినిమా అవకాశాలను రాబట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తరువాత ఒకానొక సమయంలో వారు పెళ్లి చేసుకుని తమ జీవితాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. కానీ కొంత మంది ముద్దుగుమ్మలు 50 సంవత్సరాలు దాటుతున్నా కూడా పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు వారి అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.

ఏ హీరోయిన్ అయినా ఒక దశ వరకు సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఆనందంగా ఉంటే ప్రతి ఒక అభిమానికి కూడా ఎంతో బాగా అనిపిస్తుంది కానీ కొంత మంది హీరోయిన్ లు 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అని ఎంతో ఆశ్చర్యపోతున్నారు. అవసరమైతే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతారు కానీ వీరు మాత్రం పెళ్లి కి నో అని చెబుతూ వస్తున్నారు. అలా వారిలో చాలామంది ఇప్పుడు సినిమాల్లో నటిస్తుండడం విశేషం. 

నటి శోభన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. మంచి నృత్య కారిణి కూడా..ఈమె 51 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. టబు కూడా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న కథానాయికనే. 50 ఏళ్లు వచ్చినా కూడా ఆమె ఇప్పటికి పెళ్ళి ఊసు ఎత్తడం లేదు. విశ్వసుందరి సుస్మితాసేన్ వయస్సు 42 కాగా ఆమె కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ కౌసల్య ఇప్పుడు తల్లి వదిన పాత్రలలో కనిపిస్తుంది. ఈ వయస్సు 41 కాగా ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. మరి ఇప్పటికైనా వీరు పెళ్లి చేసుకుంటారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: