వెల "సిరి": సిరివెన్నెల కొడుకు ఎవరో తెలిస్తే అవునా అనాల్సిందే..?

Divya
సిరివెన్నెల సీతారామశాస్త్రి.. అతి తక్కువ సమయంలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఈయన పేరు వినగానే గొప్ప గేయరచయిత మన కళ్ళముందు కనిపిస్తారు.. ఈయన మొదటి సారి సిరివెన్నెల అనే చిత్రంలో తన పాటలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం తో, ఇక ఈయనను అదే సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పిలవడం మొదలు పెట్టారు.. ఒక్కసారి మనసుపెట్టి కలం చేతపట్టి పేపర్ మీద అక్షరాలు రాశాడు అంటే.. మనసుకు హత్తుకునే ఎంతో అద్భుతమైన పాటలను మనం వినవచ్చు.. ఆయన కలం నుండి జాలువారిన ఏ ఒక్క పాట అయినా సరే మనం వింటే చాలు.. ఇక అందులో ఉన్న సాహిత్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అని ఈజీగా చెప్పేయవచ్చు.
తెలుగు చిత్ర పరిశ్రమలో గేయరచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ..గాయం చిత్రంలో ఒక విలేకరి పాత్రలో తెరపై నటుడిగా తళుక్కున మెరిసారు.. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన సుపుత్రుడు రాజా కూడా వెండితెరపై నటుడిగా తన ప్రతిభను ప్రేక్షకులకు చూపిస్తున్నారు.. అంతేకాదు రాజాని చూస్తే ఎవరూ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు అని గుర్తించ లేరు.. ఎందుకంటే ఈయన ఎక్కడా కూడా తన తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా కేవలం తన నటనా ప్రతిభ తోనే సినీ ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయికి చేరుకున్నారు.
ఇక ఈయన అసలు పేరు చెంబోలు రాజా.. నటించిన సినిమాల విషయానికి వస్తే.. అంతరిక్షం, ఫిదా ,హ్యాపీ వెడ్డింగ్, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఏ బి సి డి , మిస్టర్ మజ్ను వంటి ఎన్నో చిత్రాలలో నటించాడు.. ఇప్పటికే మీకు రాజా ఎవరో గుర్తుకు రాకపోతే .. ఫిదా సినిమాలో హీరో కి అన్న పాత్రలో నటించిన వారే మన సీతారామశాస్త్రి సుపుత్రుడు. ఏబిసిడి సినిమాలో యువజన నాయకుడిగా నటించిన ఈయన, అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం అయినటువంటి సవ్వడి , ఆ తర్వాత మస్తీ వెబ్ సిరీస్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: