ఆర్.ఆర్.ఆర్ కి అడ్డొస్తున్న మహమ్మారి.. మరి ఎలా..?

Divya
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య డి.వి.వి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటిస్తూ ఉండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్నారు. అంతేకాదు శ్రీయా శరణ్ కూడా ఈ సినిమాలో అజయ్ దేవగన్ కు భార్య పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. సముద్రకని , అలిసన్ డూడీ , రే స్టీవెన్సన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యం విషయానికి వస్తే, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ బ్రిటిష్ రాజు పై వ్యతిరేకంగా పోరాటం సాగిస్తే , కొమరంభీం హైదరాబాద్ నిజాం కు వ్యతిరేకంగా పోరాటం సాధించడం ఈ సినిమాలో చూపించారు.

రాజమౌళి తండ్రి కె .వి .విజయేంద్ర ప్రసాద్ రాసిన ఒక మూల కథను తీసుకొని ఈ చిత్రానికి స్క్రిప్ట్ను అందించడం జరిగింది. 1920వ సంవత్సరంలో కథాంశం విప్లవకారులు ఇద్దరూ తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం చేసే యుద్ధాన్ని మనం ఈ సినిమాలో చూడవచ్చు. 2018 లోనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడడం గమనార్హం. ఈ సంవత్సరం జూలై 30వ తేదీన చిత్రం విడుదల చేయాలని అనుకున్నా కరోనా కారణంగా షెడ్యూల్ చేయలేకపోయారు. అయితే  తరువాత జనవరి 7 2022 వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది .

కానీ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈ సినిమా విడుదలయ్యే సమయానికి కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా మారుతుందని వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్ తో సహా మిగతా రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. ఒకవేళ కరోనా సమయంలోనే చెప్పిన డేట్ వెనుక ఈ సినిమాను విడుదల చేస్తే నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఈ సినిమా ఏమాత్రం లాభాల బాటపడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: