మొదటి సినిమా హిట్.. మిగతా అన్ని ఫట్.. పాపం ఆ హీరొయిన్?
అప్పటి వరకు ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీమొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా పక్కింటి అమ్మాయిలా అందరినీ ఆకర్షించింది. . ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. కొత్త బంగారు లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన కొత్త బంగారులోకం సినిమాలో నటించింది శ్వేతా బసు ప్రసాద్.
ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ చెప్పే ప్రతి డైలాగు ఇక పాత్రకు ఉన్న క్రేజ్ మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ కట్కనెక్ట్ అయిపోయింది. ఇది ఎన్నో రోజుల పాటు శ్వేతాబసుప్రసాద్ లాగే అమ్మాయిలు అందరూ కూడా ప్రవర్తించడం మొదలుపెట్టారు అంటే ఈ అమ్మడు ఎంతలా అందరికీ కనెక్ట్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఒక్క సినిమాతోనే ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఆ తర్వాత మాత్రం చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు మాత్రం తీసుకురాలేదు. దీంతో తర్వాత అవకాశాలు కరువై తెలుగుతెరపై కనుమరుగయింది శ్వేతా బసు ప్రసాద్.