అప్పుడు కృష్ణవంశీ...మరి ఇప్పుడు బోయపాటి కూడా చేయగలడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరో గా నటించిన శ్రీకాంత్ ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా డీసెంట్ పాత్రల్లో కనిపిస్తూ జనాలను మెప్పించిన శ్రీకాంత్ ఖడ్గం సినిమా లో ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించి జనాలను అలరించాడు. శ్రీకాంత్ ఖడ్గం సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో, ఒక డిఫరెంట్ మేనరిజం లో కనిపించి ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి ప్రశంసలు పొందాడు. ఖడ్గం సినిమా లో శ్రీకాంత్ పర్ఫామెన్స్ కెరియర్ బెస్ట్ అని చెప్పిన తప్పులేదు. ఖడ్గం సినిమా లో ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీకాంత్ కు ఆ తర్వాత మాత్రం అలాంటి పర్ఫామెన్స్ చేసే పాత్ర పడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీకాంత్ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న అఖండ సినిమా లో విలన్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే శ్రీకాంత్, నాగ చైతన్య హీరో గా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా తెరకెక్కిన యుద్ధం శరణం సినిమా లో విలన్ గా కనిపించినప్పటికీ, ఈ సినిమా శ్రీకాంత్ కు విలన్ గా పెద్ద గుర్తింపు ను తెచ్చి పడలేదు. అయితే అఖండ సినిమా నుంచి తాజా గా విడుదలైన ట్రైలర్ ను చూస్తే శ్రీకాంత్ మరొక సారి ఖడ్గం సినిమా రేంజ్ క్యారెక్టర్ చేస్తున్నాడా.? అఖండ సినిమా లో శ్రీకాంత్ చేయబోయే పాత్ర మరొ క సారి అదిరి పోయే క్యారెక్టర్ అవుతుందా.? అనే విషయాలు తెలియాలంటే అఖండ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: