బాలయ్య పదేళ్ల ఆకలిని తీర్చిన 'సింహా'..!!

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో నటసింహ నందమూరి బాలకృష్ణ గారి సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు మాస్ అభిమానులకు పండగే. ముఖ్యంగా ఆయన సినిమాల్లో డైలాగ్స్, యాక్షన్, డాన్స్ లను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బాలయ్య. మాస్ ఆడియన్స్ లో బాలయ్య కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇక సమరసింహా రెడ్డి సినిమా తో ఆయన ఇండస్ట్రీ లోనే ఒక కొత్త శకానికి నాంది పలికారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. 2001 లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

 అయితే 2001 తర్వాత బాలయ్య కు ఒక్క హిట్ కూడా పడలేదు. విజయం కోసం బాలయ్య దాదాపు పది సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. 2001 నుంచి ఆయనకు వరుస ఫ్లాపులే పలకరించాయి. ఇక అభిమానులు ఒక్క హిట్ కోసం ఎన్నో ఎదురుచూపులు చూశారు. అలా 2010వ సంవత్సరంలో వారికి ఎదురు చూపులకు తెరపడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్యకు బోయపాటి సింహా రూపంలో బిగ్గెస్ట్ హిట్ ని అందించాడు.ఆ ఏడాది సింహా సినిమా అత్యధిక వసూళ్లతో రికార్డుల మోత మోగించింది.

 బాలయ్య మాస్ ఇమేజ్ కు బోయపాటి టేకింగ్ తోడై బాలయ్య సత్తాను సినీ పరిశ్రమకు చాటిచెప్పింది సింహా సినిమా. 2010 ఏప్రిల్ 30 న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే.. తెలుగు సినిమా చరిత్రలోనే సుమారు 338 కేంద్రాల్లో 50 రోజులు అలాగే 92 పైగా సెంటర్లలో 100 రోజులు 3 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా ఇదే  కావడం విశేషం. అందుకే బాలకృష్ణ కెరీర్లో సింహా సినిమా ఓ ప్రత్యేక మనే చెప్పాలి. దీంతో బాలయ్య పదేళ్ల ఆకలిని సింహ సినిమా తీర్చింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో మెప్పించగా.. ఆయన సరసన నయనతార, స్నేహ ఉల్లాల్ కథానాయికలుగా నటించారు. ఇక ఈ సినిమాకి చక్రి అందించిన సంగీతం కూడా మరో హైలెట్ గా నిలిచింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: