మరోసారి ఆ దర్శకుడితో మెగా హీరో..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు కొన్ని రోజుల క్రితం స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ హాస్పటల్లో ఉన్న సమయంలోనే ఈ హీరో నటించిన రిపబ్లిక్ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రిపబ్లిక్ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దాక్కినప్పటికీ బాక్సాఫీస్ మధ్య మాత్రం అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకున్న సాయి ధరమ్ తేజ్ దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశాడు.

 ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి,  సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆక్రమంలో దర్శకుడు మారుతి, సాయి ధరమ్ తేజ్ తో త్వరలోనే  సినిమా ఉంటుంది అని వెల్లడించారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇలా ఇప్పటికే ఒక సారి హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో మరొక సారి సినిమా వస్తుంది అని తెలియడంతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు మారుతి, గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితమే దర్శకుడు మారుతి , సంతోషం శోభన్ హీరో గా మెహరీన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి విడుదల కూడా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: