అంజనా సౌమ్య గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

Divya
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడిగా గుర్తింపుపొందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్వహించిన పాడుతా తీయగా అనే కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్ లో రన్నర్ గా నిలిచిన అంజనా సౌమ్య గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంజనా సౌమ్య తన మధురమైన గానంతో ప్రేక్షకులను మైమరపించడమే కాకుండా సంగీత దర్శకులను కూడా మెప్పించగలిగింది.. అంటే ఆమె గాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సూపర్ సింగర్ ఫోర్ లో విజేతగా నిలిచి, సూపర్ సింగర్ సెవెన్ లో కూడా విజేతగా టైటిల్ విన్నర్ గా నిలవడం గమనార్హం.
ఆ తర్వాత సదార్చన ,అన్నమయ్య  సంకీర్తనామృతం, సాయి సౌమ్య లహరి 1,2, టి సిరీస్ లో భక్తితో ఈమె చేసిన ఆల్బమ్స్ ప్రావీణ్యం పొందాయి.. సుమారుగా 60 సినిమాలలో పాటలు పాడిన అంజనా సౌమ్య ఏకంగా మలేషియా, సింగపూర్ , అమెరికా , జపాన్ వంటి అతిపెద్ద వాణిజ్య దేశాలలో కూడా సంగీత ప్రదర్శనలను ఇచ్చి , అక్కడ కూడా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది.
 
1985 సెప్టెంబర్ 29వ తేదీన పుట్టిన అంజనా సౌమ్య గోపాలకృష్ణ,  విద్యల సుమతి అనే దంపతులకు జన్మించింది.. కాకినాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసి.. విశాఖపట్నంలోని గీతం కాలేజీ లో ఎమ్మెల్యే పూర్తి చేసిన అంజనా సౌమ్య కాకినాడ లో ఉన్న సంగీత ఉపాధ్యాయులు అయినటువంటి కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకుంది..
అంతేకాదు సంగీతం లో ఈమె డిప్లమో చేసి ఆల్ ఇండియా లెవెల్ లోనే గోల్డ్ మెడల్ సాధించిన ఘనత కూడా ఈమెకే దక్కింది.. 2011 వ సంవత్సరంలో అమెరికాలో కాలిఫోర్నియా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన రవితేజను పెద్దల సమక్షంలో.. పెద్దలు చెప్పినట్టుగా సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వాన చినుకులు.. లవ్లీ సినిమా లో చోరీ చోరీ, ప్రేమ కావాలి సినిమాలో లిసన్ టు మై హార్ట్, ఆ పెళ్ళంట సినిమాలో చినుకులా రాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో కొన్ని వందల పాటలు పాడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: