లేటెస్ట్ డైలాగుతో ట్రెండింగ్ అవుతున్న రాశి కన్నా..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ రాశి కన్నా నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమా లోనే తన అందంతో, అభినయం తో, నటన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ తెలుగులో క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంది. అందులో భాగంగా రాశి ఖన్నా తొలిప్రేమ, బెంగాల్ టైగర్, హైపర్, వెంకీ మామ, సుప్రీమ్, జిల్, ప్రతి రోజు పండగే వంటి తెలుగు సినిమా లలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఇది లా ఉంటే ప్రస్తుతం రాశి కన్నా గోపీచంద్ హీరో గా మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే తాజా గా ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్ర బృందం పక్కా కమర్షియల్ సినిమా నుండి బయటకు వదిలిన టీజర్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే ఈ టీజర్ లో రాశి కన్నా డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ తో 'ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు.. ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి' అంటూ ఒక డైలాగ్ ను పలికింది. ఇలా రాశి కన్నా డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో పలికిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమా నుండి బయటకు వచ్చిన టీజర్ ద్వారా కూడా ఈ సినిమా పై అంచనాలు భారీ గా పెరిగాయి. రాశి కన్నా ఈ సినిమాతో పాటు  నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: