మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

NAGARJUNA NAKKA
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్‌ సినిమాకి బ్రేకులు పడుతున్నాయట. భారీ బజ్‌తో మొదలైన ఈ పాన్‌ ఇండియన్‌కి అనుకోని అవాంతరం వచ్చిందని, రామ్‌ చరణ్‌కి గ్యాప్‌ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో మొదలైన ఈ సినిమాకి వచ్చిన అడ్డంకులు ఏంటి? చరణ్‌కి ఎందుకు గ్యాప్ వస్తోందనే సందేహాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.
కమల్‌ హాసన్‌ 'ఇండియన్2' షూటింగ్‌ రీస్టార్ట్ చేస్తామని చెప్పిన కొన్నాళ్లకే శంకర్, రామ్‌ చరణ్‌ సినిమా మొదలైంది. పూణె షెడ్యూల్‌కి కూడా వెళ్లింది. దీంతో 'ఇండియన్2'కి కంప్లీట్‌గా డోర్స్‌ క్లోజ్ అయ్యాయనే ప్రచారం జరిగింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో శంకర్‌కి గ్యాప్ కూడా పెరిగిందని ఇక ఈ సినిమా మళ్లీ సెట్స్‌కి వెళ్లడం అసాధ్యమనే మాటలు కూడా వినిపించాయి.
శంకర్, రామ్ చరణ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. కానీ చెన్నై జనాలు మాత్రం ఈ ప్రాజెక్ట్‌కి బ్రేకులు పడే అవకాశముంది అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్, శంకర్‌ ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారని, డిసెంబర్‌ నుంచి మళ్లీ 'ఇండియన్2' షూటింగ్‌ మొదలవుతుందని చెప్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు చరణ్‌ ప్రాజెక్ట్‌కి బ్రేక్ ఇస్తాడట శంకర్.
లైకా ప్రొడక్షన్స్‌కి శంకర్‌కి మధ్య జరిగిన గొడవలతో 'ఇండియన్2' షూటింగ్ ఆగిపోయింది. ఈ గొడవలు కోర్టు వరకు వెళ్లాయి. ఆ తర్వాత 'ఇండియన్2' పూర్తి చెయ్యడానికి ఒప్పుకున్నాడు  శంకర్‌. ఈ ఒప్పందంలో భాగంగానే డిసెంబర్ నుంచి 'ఇండియన్2' షూటింగ్‌ మళ్లీ మొదలవుతుందట.  వచ్చే దీపావళికి సినిమాని రిలీజ్‌ చేస్తారట. మరి 'ఇండియన్2' పూర్తయ్యే వరకు చరణ్ వెయిట్‌ చేస్తాడా, లేకపోతే మరో సినిమా స్టార్ట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శంకర్ తో రామ్ చరణ్ సినిమా డైలమాలో ఉంటోంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎపుడు ఆగిపోతుందో ఎవరికీ అర్థం కావడంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: