ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సోనూసూద్ సపోర్ట్..!!

Anilkumar
రియల్ హీరో సోను సూద్ నటుడిగా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. లాక్ డౌన్ లో అనేక సేవా కార్యక్రమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సోను సూద్. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చేయని ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఎంతో మందిని ఆదుకున్నారు సోనుసూద్. తనదైన శైలిలో అందరినీ ఆదుకుంటూ వేరే ఏ హీరోలకి లేనంత పాపులారిటీని సంపాదించుకున్న వారు. ఇకపోతే సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల సోనుసూద్ బిగ్ బాస్ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

బిగ్ బాస్
 సీజన్ 5 లో శ్రీ రామ్ చంద్ర ను చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా నేను కూడా రోజు బిగ్ బాస్ షో ను ఫాలో అవుతున్నాను అని చెప్పారు. అయితే బిగ్ బాస్ షోలో ఎంతమంది కంటెస్టెంట్ లు ఉన్నా శ్రీరామచంద్ర బెస్ట్ గా నిలవాలి అని కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ రామచంద్ర కు కు ఇవే నేను అందించే ప్రేమాభి అభినందనలు అని తెలియజేశారు. అంతేకాకుండా ఐ లవ్ యు మాన్ అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అవును సార్ ఇలా చెప్పడం తో బిగ్బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ శ్రీ రామచంద్ర అనే అందరూ అంటున్నారు. 

సోను సూద్ ఒకరే కాకుండా మరి కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా శ్రీ రామచంద్ర సపోర్ట్  చేస్తున్నారు. అయితే శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడల్ షో విన్నర్  కావడం వల్ల దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గా ప్రవర్తిస్తూ మిస్టర్ కూల్ అనే పేరును కూడా శ్రీరామచంద్ర సొంతం చేసుకున్నాడు. రోజురోజుకు స్ట్రాంగ్ గా తయారవుతూ స్ట్రాంగ్ ప్లేయర్గా మారుతున్నాడు రామ్. ఇంతే కాకుండా స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం శ్రీరామచంద్రకు సపోర్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతమంది సపోర్ట్ చేస్తున్న చివరికి బిగ్బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ శ్రీ రామచంద్ర అవుతాడో లేదో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: