'గని' గా మారిన బన్నీ తనయుడు అల్లు అయాన్.. నెట్టింట్లో వీడియో వైరల్..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీ లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఈతరం నుంచి ఇటీవల అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తున్న 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్హ బాల భరతుని గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. 

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే తాజాగా విడుదల చేసిన వీడియో అని చెప్పొచ్చు. బన్నీ తనయుడు అల్లు అయాన్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గని స్టైల్లో అల్లు అయాన్ వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'గని' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

 గని అనే  బాక్సర్ గా వరుణ్ తేజ్ చేసే వర్కౌట్స్ ప్రధానంగా ఈ పాట సాగుతుంది. అయితే ఇదే పాటను వరున్ తేజ్ స్టైల్లో అల్లు అయాన్ రీ క్రియేట్ చేశాడు. వరుణ్ తేజ్ తరహాలోనే భారీ వర్కౌట్ చేశాడు. ఈ వీడియోకి వరుణ్ తేజ్ కూడా ఆశ్చర్యానికి గురి కావడం విశేషం. ఈ వీడియో తో అయాన్ మెగా, అల్లు అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ వీడియోని గీతా ఆర్ట్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఇక ఈ వీడియోలో అల్లు అయాన్ ని చూసి బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. అయాన్ అచ్చం బన్నీ లాగానే ఉన్నాడని, స్టైల్లో, ఎనర్జీ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని కామెంట్ చేస్తూ అల్లు అయాన్ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు...!!మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: