ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

Pulgam Srinivas
ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి తన మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.  తర్వాత బస్టాప్, ఉన్నది బలే బలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి పలు చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ దర్శకుడు గత కొద్ది కాలం క్రితం గోపీచంద్ హీరోగా యువి క్రియేషన్స్ జీటు బ్యానర్ పై పక్కా కమర్షియల్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా కొద్దిభాగం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దేశంలో కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ గ్యాప్ లో దర్శకుడు మారుతి సంతోష్ శోభన్ హీరోగా మెహరిన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అని ఒక చిన్న సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాను ఈ మధ్యే థియేటర్ లలో విడుదల కూడా చేశాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి కి ఒక కథ వినిపించాను అని, ఆన్లైన్ చిరంజీవి కి బాగా నచ్చింది అని, ఆ లైన్ ను డెవలప్ చేయమని చిరంజీవి చెప్పినట్టుగా మారుతి తెలియజేశాడు. ఇలా దర్శకుడు మారుతి అదిరిపోయే ఛాన్స్ కొట్టేశాడు అని చాలామంది అనుకునేలోపే మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మారుతి మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్ కు కూడా ఒక కథను వినిపించాడు అని, ఆ లైన్ ప్రభాస్ కు కూడా చాలా బాగా నచ్చింది అని, త్వరలో మారుతి, ప్రభాస్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక వేళ మారుతి కనుక నిజంగానే ప్రభాస్ తో సినిమా చేసినట్లయితే అది పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: