మెగాస్టార్ మారుతీ కాంబినేషన్ పై నెగటివ్ టాక్ వినిపిస్తుందా...?

murali krishna
దర్శకుడు మారుతి కమర్షియల్ డైరెక్టర్ అని అందరికి తెలుసు.. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో మారుతికి బాగా తెలుసని అందుకే, చేసే ప్రతి సినిమాలో ఒక బోల్డ్ పాయింట్ తీసుకుంటాడని ఆ పాయింట్ చుట్టూ కథను అల్లుకుని హిట్లు కొడుతూ ఉంటాడని మారుతికి తెలిసిన విద్య ఇదేనని అంతేగాని మారుతిలో గొప్ప కథకుడు లేడని అలాగే గొప్ప షాట్ మేకర్ కూడా లేడని కొందరు అంటుంటారట.

మరి ఇలాంటి మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఎంతవరకు న్యాయం చేస్తాడో గతంలో వెంకటేష్ తో ఒక సినిమా చేసి వెంకీకి దారుణమైన ప్లాప్ ను ఇచ్చాడని దాంతో మారుతి స్టార్ హీరోలకు పనికిరాడు అని తేలిపోయిందని తెలుస్తుంది.. అయితే, అప్పటి నుంచి చిన్న,చిన్న సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొడుతూ మొత్తానికి తనను తాను బాగా ప్రమోట్ చేసుకున్నాడని తెలుస్తోంది.

ఎలాగూ హిట్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి.. మారుతిని మంచి విషయం ఉన్న దర్శకుడిగా ట్రీట్ చేశారట.. నిజం చెప్పాలంటే.. అందుకు తగ్గట్టుగానే మారుతి ఖాతాలో భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు మరియు ప్రతిరోజూ పండగే లాంటి పెద్ద హిట్లు ఉన్నాయని కాబట్టి.. మారుతి పక్కా కమర్షియల్ హిట్ డైరెక్టర్ గానే చెప్పుకోవాలని తెలుస్తుంది.

కానీ, అగ్ర హీరోలతో సినిమాలు చేయలేడు అనే పేరును మాత్రం మారుతి పోగొట్టుకోవడం కష్టంగా మారినట్లు తెలుస్తుంది.అందుకే, ఏకంగా.. చిరంజీవితోనే సినిమా ఓకే చేయించుకున్నాడుని మారుతి - చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతోందని వార్త వినిపిస్తుంది.కానీ మారుతి మార్క్ సినిమాలు, కథలు చిరుకి అలాగే మెగా అభిమానులకు కనెక్ట్ కావు అనేది అందరూ చెప్పే మాట అని తెలుస్తుంది.

దీనికితోడు మారుతి దర్శకత్వం వహించిన `మంచి రోజులొచ్చాయి` సినిమా పై నెగిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తుంది.. అదే బోల్డ్ పాయింట్ మరియు అదే కుళ్ళు జోకులు ఇక స్టార్ హీరోలతో సినిమాలు ఏమి చేస్తాడు అని ముఖ్యంగా మెగాస్టార్ తో సినిమా ఏమి చేస్తాడు అంటూ మారుతి పై నెగిటివ్ ప్రచారం మొదలైందని వార్త వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: