చిరంజీవితో సినిమాపై స్పందించిన దర్శకుడు మారుతి..!

Pulgam Srinivas
ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి తన మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బస్టాప్, బలే బలే, మగాడివోయ్, మహానుభావుడు బాబు బంగారం,  ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మారుతి ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా మెహరిన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 4 వ తేదీన థియేటర్ లో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా గా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న మారుతి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశాడు. గత కొద్ది కాలంగా మారుతి, మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక కథనాలు బయటకు వచ్చాయి. ఈ కథనాలపై దర్శకుడు మారుతి ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ వార్తలను ఒక రూమర్ లాగా జనాలు కొట్టిపారేశారు.

అయితే తాజాగా మంచి రోజులు వచ్చాయి ప్రమోషన్ లో భాగంగా మారుతి చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి కి ఒక కథ వినిపించాను, ఆ లైన్ చిరంజీవి కి చాలా బాగా నచ్చింది. దానిని డెవలప్ చేయమని చెప్పారు. చిరంజీవి తో సినిమా కచ్చితంగా ఉంటుంది అని దర్శకుడు మారుతి తెలియజేశాడు. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య,  మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్నాడు. వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్. బాబి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల తర్వాతే మారుతి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: