రవితేజ ఆ అలవాటు మానుకోడా!!

P.Nishanth Kumar
మాస్ రాజా రవితేజ కు ఒక చెడ్డ అలవాటు ఉన్నా కూడా దాన్ని మంచిగానే ఉపయోగించుకుంటున్నాడు. ఆయన తన కెరీర్ మొదటి నుంచి ఫ్లాప్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వారికి హిట్ ఇవ్వడం తో పాటు తాను కూడా హిట్ అందుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఓ ఇద్దరు ఫ్లాప్ హీరో లకు ఛాన్స్ ఇచ్చి వారి కెరీర్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లో ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ సినిమా చేయగా దానికి ముందు హరీష్ దర్శకత్వం వహించిన షాక్ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇప్పుడు అసలు ఫాంలో లేని దర్శకుడు రమేష్ వర్మ తో కిలాడి అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఓ కొత్త దర్శకుడు అయినా శరత్ తో కలిసి ఆయన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు. క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసినా కూడా రవితేజ పెద్ద దర్శకులతో కాకుండా తనను నమ్ముకున్న పైకి ఎదగాలని అనుకున్న దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ సింపుల్గా సినిమాలు చేసేస్తున్నాడు. ఇతర హీరోలు అగ్ర హీరోలు పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్ లు సంపాదిస్తుంటే రవితేజ అవేవీ పట్టించుకోకుండా నార్మల్ దర్శకులతో సూపర్ హిట్లు కొడుతున్నాడు.

స్వామిరారా సినిమాతో మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ ఆ తర్వాత కొన్ని సినిమాలతో ఆకట్టుకున్న కూడా కేశవ మరియు రణ రంగం వంటి సినిమాలతో భారీ ఫ్లాపులు అందుకున్నాడు. దాంతో ఆ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు రవితేజ ఆయనకు మరొక సువర్ణావకాశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనతో ఓ వెరైటీ సినిమా చేయమన్నాడు. తప్పకుండా ఈ సినిమా రవితేజ కెరీర్లో వెరైటీ సినిమాగా రాబోతుందని చెబుతున్న నేపథ్యంలో సుధీర్ వర్మ ఈ సినిమాను ఏ రేంజ్ లో డీల్ చేస్తాడు అనేది చూడాలి. మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: