చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

Divya
ఇప్పుడున్న చాలామంది హీరో హీరోయిన్లు అప్పట్లో చైల్డ్ యాక్టర్లుగా సినీ ఇండస్ట్రీలో తమ కెరీర్ ని మొదలు పెట్టారు. ఇక ఒకవైపు తమ విద్యాభ్యాసం కొనసాగిస్తూనే మరోవైపు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా కొనసాగుతూ మంచి భవిష్యత్తుకు పునాదులు కూడా వేసుకున్నారు.. అలాంటి వారిలో హీరో తనీష్ కూడా ఒకరు.. తనీష్ చైల్డ్ యాక్టర్ గా మనందరికీ సుపరిచితులే..ఇక మొదటిసారి 1998వ సంవత్సరంలో వెంకటేష్ హీరోగా, ప్రీతి జింటా హీరోయిన్ గా వచ్చిన ప్రేమంటే ఇదేరా అనే సినిమాలో చైల్డ్ యాక్టర్ గా తనదైన శైలిలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తనీష్.

ఆ తర్వాత 2000 సంవత్సరంలో యువకుడు, నిన్నే ప్రేమిస్తా, దేవుళ్ళు వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించాడు.. దేవుళ్ళు సినిమాలో అయ్యప్ప స్వామి పాత్ర వేసిన తనకు, మంచి గుర్తింపు లభించింది. ఇక 2002వ సంవత్సరంలో మన్మధుడు సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే కి తమ్ముడి పాత్రలో నటించి మెప్పించాడు.. ఆతర్వాత 2006వ సంవత్సరంలో ఏవండోయ్ శ్రీవారు అనే సినిమాలో కూడా హీరోయిన్ కి సోదరుడి పాత్రలో తనదైన శైలిలో మంచి గుర్తింపు పొందారు. ఇక మొదటి సారి హీరోగా 2008వ సంవత్సరంలో  నచ్చావులే అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మాధవీలత నటించింది.

ఆ తర్వాత రైడ్ ,తెలుగబ్బాయి, పాండవులు పాండవులు తుమ్మెద, నక్షత్రం వంటి మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇకపోతే బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2  లో నాచురల్ స్టార్ హీరో నాని హోస్ట్ గా చేసిన ఈ షోలో కంటెస్టెంట్ గా పోటీ చేసి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.ఇక అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా 1998వ సంవత్సరం నుంచి 2006 వరకు నటించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు హీరో తనీష్. ఇక ప్రస్తుతం ఇక మంచి పాత్ర, కథ  కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: