టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఇవేనట..!

Divya
సినీ ఇండస్ట్రీ లో ఉండేవారు కదా కోట్లల్లో డబ్బులు ఉంటాయి.. వారు ఎలాంటి ఆహారానైనా ఇష్టంమొచ్చినట్లు తినొచ్చని అనుకుంటారు. కానీ మన వాళ్ళు మాత్రం కోట్లు రూపాయలు ఉన్నప్పటికీ కూడా.. డైట్ వంటి పాటిస్తూ ఉంటారు. అందుచేతనే వారికి ఇష్టమైన ఆహారాన్ని కళ్ళముందు ఉన్నప్పటికీ కడుపునిండా తినలేరు. అయితే మరికొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత జిమ్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారంమేదో ఇప్పుడు చూద్దాం.

1).చిరంజీవికి ఎక్కువగా సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే అని ఎక్కడికి వెళ్లినా ముందుగా ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు అంటే చాలా ఇష్టమట.
2). సూపర్ స్టార్ రజినీకాంత్ కు చికెన్ అంటే చాలా ఇష్టమట. మటన్ అన్నా కూడా చాలా ఇష్టం. ఈ రెండు చాలా ఇష్టంగా తింటారట సూపర్ స్టార్.
3). పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమైన ఫుడ్ చేపల పులుసు, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసు, కలర్ రైస్ వంటివి చాలా ఇష్టం.
4). మహేష్ బాబు కు ఇష్టమైన ఆహారం బిర్యాని, చేపల పులుసు అంటే మరింత ఇష్టమట. ఈయన ఎక్కువగా డైట్ ను ఫాలో అవుతాడు.
5). బాలకృష్ణ కు ఇష్టమైన ఆహారం చికెన్ బిర్యాని, అలాగే రొయ్యల పులుసు కూడా చాలా ఇష్టమట. అందులోకి లంక చుట్ట పొగ తాగడం అంటే బాలకృష్ణకు మరింత ఇష్టమట.
6). వెంకటేష్ కు తన తండ్రి చేసే నోస్టాలజిక్ అంటే చాలా ఇష్టమట. హాట్ హాట్ అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తినడం వెంకటేష్ కు అలవాటు.
7). రామ్ చరణ్ కు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక నాని నాయనమ్మ చేతి వంట అంటే మరింత ఇష్టమని అని సమాచారం.
ఇక వీరే కాకుండా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: