పాటలపై వివాదం... పబ్లిసిటీ స్టంటా?

Vimalatha
సినిమాలో ఐటెం సాంగ్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే చాలా సినిమాల్లో ఖచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాలని కోరుకుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇటీవల కాలం లో వరుసగా పాటలు వివాదాస్పదమవుతున్నాయి. హీరోయిన్ల కు కురచ దుస్తులు వేసి కొన్ని పాటల ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అంటున్నారు. వివాదాల ద్వారా ఇలా పబ్లిసిటీ కోసం ప్రయత్నించడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు కొందరు.
అక్టోబర్ 29 న విడుదలైన "వరుడు కావలెను" సినిమాలో నుంచి "దిగు దిగు నాగ" సాంగ్ వివాదాస్పదమైంది. లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ పై కేసు కూడా నమోదైంది. ఇక ఇటీవల 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే సినిమా లో నుంచి "భజ గోవిందం" అనే పాటను అశ్లీలంగా చిత్రీకరించారు అంటూ హిందూవాదులు ఫైర్ అయ్యారు. ఇలాంటి పాటలు యువతీ యువకుల మీద ప్రభావం చూపుతాయంటూ రచ్చ చేశారు. యువత వాటిని భక్తి పాటలనే సంగతి మరిచిపోయి ఐటెం సాంగ్స్‌గా భావిస్తున్నారని, ఇలాంటి సాంగ్స్ తీయడం హిందువులను అవమానించినట్టే అని భావిస్తున్నారు కొందరు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాటు కాదని, అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఆ లిరిక్స్ తొలగించామన్నారు ఆ చిత్ర దర్శకుడు యుగంధర్ పేర్కొన్నారు.  
ఇక ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి పాడిన 'మైసమ్మ' పాట కూడా వివాదం లో చిక్కుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా', 'మోతెవరి' వంటి పదాల పై కొన్ని హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. దీంతో మేకర్స్ ఆ పదాలను తొలగించి కొత్త పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు వాదిస్తున్నా మేకర్స్ మాత్రం కావాలని ఆలా చేయడం లేదని చెబుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: