సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న మెగా మేనల్లుడి పెళ్లెప్పుడో?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు అందరు స్టార్ హీరోల పెళ్లిళ్లు అయిపోయాయి అన్న విషయం తెలిసిందే.  గతంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పెళ్లిళ్లు వరుసగా జరిగిపోయాయి. ఆ తర్వాత మొన్నటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగాడు దగ్గుపాటి రానా.  ఈ హీరో పెళ్లి గురించి కొన్నాళ్ళ వరకు తెలుగు చిత్ర చర్చ జరిగింది. కానీ తన ప్రియ సఖి ని పెళ్లి చేసుకొని ఇక ఓ ఇంటివాడు అయ్యాడు రానా. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు మెగాహీరో సాయిధరమ్తేజ్.  దీంతో ప్రస్తుతం ఇక ఈ హీరో పెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 సాయిధరమ్తేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో సాయిధరంతేజ ఎక్కడికి వెళ్ళినా నీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది.  అయితే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారని కానీ తనకు మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ చెప్పేసాడు. దీంతో ఇప్పట్లో సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకునేలా లేడు అని అనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. మరి ఈ మెగా మేనల్లుడు తన బ్యాచిలర్ లైఫ్ కి ఎప్పుడు స్వస్తి పలుకుతాడు అన్నది చూడాలి మరి.

 ఇకపోతే ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమైన సాయి ధరంతేజ్ చిత్రలహరి అనే సినిమాతో మరోసారి ట్రాక్ లో పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సాయిధరమ్తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇటీవలే  రిపబ్లిక్  సినిమా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరంతేజ్.ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది అనే చెప్పాలి.  ఇటీవలే రోడ్డు ప్రమాదం బారిన పడిన సాయి ధరంతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: