తమిళ సినిమా.. తెలుగు లో బ్లాక్ బస్టర్?

praveen
ఒకప్పుడు తెలుగు హీరోల సినిమాలు టాలీవుడ్ లో.. తమిళ హీరోల సినిమాలు కోలీవుడ్లో విడుదలయ్యేవి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఇక కోలీవుడ్ హీరోల కు సంబంధించిన సినిమాలు టాలీవుడ్లో కూడా విడుదల అవ్వడం మొదలు అయింది. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ హీరోల అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆదరించటం మొదలుపెట్టారు. సినిమా బాగుండాలి కానీ హీరో ఎవరైనా సరే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకుల నిరూపించారు.  ఈ క్రమంలోనే అటు కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు టాలీవుడ్లో కూడా తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు.

 ఇలా ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ హీరో అయినప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరో గా మారిపోయాడు సూర్య. ఎన్నో ఏళ్ల నుంచి సూర్య తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  సూర్య   గజిని సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యడు సూర్య. ఇక ఆ తర్వాత కూడా తాను నటించిన అన్ని సినిమాలను కూడా తెలుగులో కూడా విడుదల చేయడం మొదలు పెట్టాడు. తెలుగు ప్రేక్షకులు కూడా  మన హీరోలను ఆదరించినట్లు గానే తమిళ హీరో సూర్యని ఆదరిస్తూ వచ్చారు.  ఇలా ఇప్పటివరకు సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.

 ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి చెప్పాలి. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది.  ఎవరైనా హీరో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు అంటే చాలు ఎగబడి మరీ తెలుగు ప్రేక్షకులు వీక్షిస్తూ ఉంటారు. ఇలా యముడు సినిమాతో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ గా సింగం 2, సింగం 3 సినిమాలను కూడా చేశాడు. ఇక ఈ సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు ఏదో తెలియని ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 139 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్బస్టర్ విజయాలను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: