ప్రభాస్ ఫిజిక్ కు కారకుడైన లక్ష్మణ్ రెడ్డి !

Seetha Sailaja
నిన్న ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు మంచి జోష్ తో సెలెబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘రాథే శ్యామ్’ మూవీకి సంబంధించిన విక్రమాదిత్య పాత్రకు సంబంధించిన టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. దీనితో ‘రాథే శ్యామ్’ మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ప్రభాస్ పుట్టినరోజునాడు అతడి ఫిజికల్ ట్రైనర్ కు సంబంధించిన విషయాలు కూడ బయటపడటంతో ఆ న్యూస్ కూడ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫిజికల్ ట్రైనర్ పేరు లక్ష్మణ్ రెడ్డి 2010 సంవత్సరంలో లాస్ వెగాస్ లో జరిగిన మిష్టర్ వరల్డ్ పోటీలలో పాల్గొని ఇతడు విజేతగా మారాడు. ఆతరువాత అతడి గురించి వివరాలు తెలుసుకున్న అతడిని తన పర్సనల్ ట్రైనర్ గా నియమించుకోవడమే కాకుండా అతడికి ఆమధ్య ఖరీదైన రేంజ్ రోవర్ కారును ప్రభాస్ బహుమతిగా ఇచ్చాడట.

సినిమా హీరోగా మారాలని ఎప్పుడూ అనుకోని ప్రభాస్ తాను భోజన ప్రియుడు కావడంతో ఒక మంచి హోటల్ ను హైదరాబాద్ లో పెట్టాలని హీరో అవ్వకముందు అనేక ప్రయత్నాలు చేసాడట. అయితే అప్పట్లో ప్రభాస్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో అప్పట్లో ప్రభాస్ తాను కలలు కన్న హోటల్ ను పెట్టుకోలేక పోయాడట. అలాంటి ప్రభాస్ ఈరోజు 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు అంటే అదృష్టం అనేది ఏ వ్యక్తిని అయినా ఎలా మార్చేస్తుందో అర్థం అవుతుంది.

‘బాహుబలి’ షూటింగ్ సమయంలో తన ఫిజిక్ మెయిన్ టైన్ చేయడానికి రోజుకు 20 కోడిగుడ్లు తిన్నాడు అంటే నటన పట్ల అతడికి ఉన్న కమిట్ మెంట్ అర్థంఅవుతుంది. శ్రీరాముడి పాత్రలో ‘ఆదిపురుష్’ లో కనిపించబోతున్న ప్రభాస్ అలాంటి పాత్రను అంగీకరించడం ద్వారా చాల సాహసం చేసాడు అనుకోవాలి. బాలీవుడ్ ను శాసించిన ఖాన్ త్రియం మ్యానియా బాగా తగ్గిపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం ఖాళీగా ఉంది ఆ స్థానాన్ని ప్రభాస్ ఆక్రమిస్తాడని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది అంటే అతడి మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: