శర్వానంద్ కి అసలేమైంది.. కొత్త గా ఆలోచించు బాసూ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ మంచి ఇమేజ్ ఏర్పరచుకొని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో శర్వానంద్. మొదటి నుంచి ఆయన సినిమాలు వరుస చూస్తే మంచి కథతో ఎమోషన్స్ తో కూడిన సినిమా లే ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాలు చేసే శర్వానంద్ లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా యాక్షన్ హీరోగా అన్ని రకాల జోనర్ లలో సినిమాలను చేసి ప్రేక్షకులను ఇప్పటివరకు అలరిస్తూ వచ్చాడు.

ఇటీవలే ఆయన హీరోగా నటించిన మహా సముద్రం సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు అని చెప్పాలి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇది మాత్రమే కాదు ఆయన నటించిన గత సినిమాలు భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకోగా 2017 వ సంవత్సరంలో ఆయన హీరోగా చేసిన శతమానం భవతి సినిమా తర్వాత ఆ రేంజిలో హిట్ ఇంతవరకు అందుకోలేదు శర్వానంద్. 

రాధా, పడి పడి లేచే మనసు, రణరంగం, మహాసముద్రం అంటూ వరుసగా రెండు హ్యాట్రిక్ ఫ్లాపుల ను తన ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్. అయితే సినిమాల ఎంపికలో లోపం స్పష్టంగా కనబడుతుంది అని ఆయన చేస్తున్న సినిమాలను బట్టి చెప్పవచ్చు. మంచి దర్శకులతో ముందుకు వెళుతున్న కూడా ఆ దర్శకులు శర్వానంద్ హిట్ ఇవ్వడంలో దారుణంగా విఫలం అయ్యారు. మరి ప్రస్తుతం రెండు సినిమాలు ఆయనకు హిట్ ను అందిస్తాయి అనేది చూడాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో పాటు నూతన దర్శకుడితో కలిసి ఒకే ఒక జీవితం అనే సినిమాను కూడా శర్వానంద్ చేస్తున్నాడు ప్రస్తుతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: