ఈ పాత్రకు ఈమె తప్ప మరొకరు లేరు అనిపించేలా నటించిన నటి..!!
తన మాట తీరు.. బాడీ లాంగ్వేజ్.. నటన.. అందం.. అభినయం.. అన్నింటితో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆమనీ భార్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె ఎక్కువగా జగపతిబాబుకు భార్య పాత్రలో నటించి వీరిద్దరు మంచి హిట్ జోడీగా కూడా గుర్తింపు పొందారు. శుభలగ్నం సినిమాలో ఆమని నటన అమోఘం అని చెప్పవచ్చు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన అతి చిన్న సినిమా శుభలగ్నం. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్యగా ఈ చిత్రంలో ఆమనీ ఎంతో అద్భుతంగా నటించింది.
అంతే కాదు ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కి కూడా కలెక్షన్ల సునామీ కురిపించి, నష్టాల నుంచి బయటకు పడేసింది ఈ సినిమా. ఈ సినిమాలో ఆమని పాత్రను చూడడానికి మహిళలు థియేటర్లలో క్యూ కట్టారు.. అతి తక్కువ సమయంలోనే శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయింది..ఇందులో నటించిన రోజా, ఆమని, జగపతిబాబు ఇలా పలువురు స్టార్లకు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఈ సినిమా.. ఈ సినిమా తర్వాత ఆమనీకి అవకాశాలు వెల్లువలా వచ్చాయి అని చెప్పవచ్చు.