క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమాలో ఇలియానా..!

Pulgam Srinivas
ఇలియానా, రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు ఇలియాన అంద చందాలకు, నటనకు, హావభావాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా పోకిరి, కిక్, ఆట, రాఖీ, జల్సా, మున్నా, శక్తి, ఖతర్నాక్ వంటి పలు తెలుగు చిత్రాలలో నటించిన ఇలియానా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

సంవత్సరానికి రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ తెలుగులో తన హవా కొనసాగించిన ఇలియానా ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ చూపి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది, కానీ బాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. ఆ తర్వాత రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మరో సారి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇలియానాకు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇలా కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో సంవత్సరానికి రెండు, మూడు సినిమా లను విడుదల చేసిన ఇలియానా ప్రస్తుతం మాత్రం ఖాళీ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇలా కెరీర్ లో ఎన్నో విషయాలను చూసిన ఇలియానా ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందు కోసం ఇలియానా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోందట, ఈ నేపథ్యంలో ఇలియానా దగ్గరికి ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ రాగ దానికి ఇలియానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: