ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రం అప్పుల అప్పారావు

P.Nishanth Kumar
1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ మరియు శోభన జంటగా నటించిన చిత్రం అప్పుల అప్పారావు. హాస్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో తనకు పోటీ ఎవరు లేరని అప్పటికే నిరూపించుకున్నాడు ఇవివి సత్యనారాయణ.  దానికి ముందు ఎన్నో విజయవంతమైన హాస్యభరిత చిత్రాలను తెరకెక్కించిన ఈవీవీ మరొకసారి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ అప్పుల అప్పారావు అనే సినిమాను తెరకెక్కించాడు.  కామదేను క్రియేషన్స్ బ్యానర్ పై సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రముఖ నటి రమాప్రభ ఈ సినిమాను సమర్పించింది.

భారీ విజయాన్ని దక్కించుకుని ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన సినిమా ఇది.  తెలుగు సినిమాలో చెప్పుకోదగ్గ హాస్యభరితమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది అప్పుల అప్పారావు.  ప్రతి చిన్నదానికి అప్పులు చేస్తూ అప్పుల వారిని తానే రివర్స్ లో పీడిస్తుంటాడు హీరో. అలా అతను ఓ అమ్మాయిని ప్రేమించగా ఆమెను పెళ్లి చేసుకోవాలంటే తన ముగ్గురు చెల్లెలకు పెళ్లి చేయాలనే నిబంధనను పెడుతుంది హీరోయిన్. అలా ఆ ముగ్గురు మరదళ్లుకు పెళ్ళిళ్ళు చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఏవిధమైన సవాళ్లు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథ.

ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పంచులతో ఈ చిత్రం కొనసాగింది. సినిమా కథే ప్రేక్షకులను ఎంతో అలరించే విధంగా ఉండటంతో ముందు నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ చిత్ర బృందం లో ఉండగా అనుకున్నట్టుగానే ఈ చిత్రం విడుదల తర్వాత సూపర్ హిట్  నిలిచింది. కామెడీ ప్రధానమైన చిత్రాలతో దూసుకుపోతున్న రాజేంద్రప్రసాద్ కు ఈ చిత్రం ఎంతో గొప్ప పేరు తీసుకువచ్చింది.  ఇప్పటికీ ఆయన కెరీర్లో బెస్ట్ సినిమా ఏది అంటే ఈ అప్పుల అప్పారావు సినిమా అని చెబుతాడు.  అలాగే ఈ సినిమాకి సంగీతం కూడా మంచి ప్లస్ అయ్యింది. రాజన్ నాగేంద్ర అనే సంగీత దర్శక ద్వయం ఈ చిత్రాన్ని కి సంగీతం అందించగా ప్రతి పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు అన్ని పాటలను పాడి ప్రేక్షకులను మరొకసారి ఉర్రూతలూగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: