ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ చేయలేని సాహసం చేసిన అనుష్క..!

Divya
సాధారణంగా హీరోయిన్లు అందం విషయంలో ఏమాత్రం రాజీ పడరు అన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత గ్లామర్ తగ్గుతుందన్న కారణంతో పిల్లల్ని కనడానికి కూడా వెనుకాడుతున్నారు. ఇక వీరు అందంగా కనిపించడానికి తీసుకునే ఆహార నియమాలతో పాటు ప్రతిరోజూ యోగాలు, ఎక్సర్సైజులు, వ్యాయామాలు వంటివి ఎన్నో చేస్తూ అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు.. కానీ కేవలం సినిమా కోసం.. ప్రేక్షకులను అలరించడానికి ఏ హీరోయిన్ కూడా చేయలేనంత సాహసాన్ని చేసింది అనుష్క.. అది కూడా అందం విషయంలో.. అయితే ఆ సినిమా ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

మొట్టమొదటిసారిగా అత్యధిక బరువు తో అనుష్క ను చూపించిన సినిమా సైజ్ జీరో.. ఈ సినిమాలో అనుష్క ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు ఈమె రెండు మూడు నెలల్లోనే అత్యధిక బరువును సాధించింది కానీ, ఈ సినిమా తర్వాత ఎన్ని సంవత్సరాలు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన అధిక బరువు మాత్రం తగ్గించుకోలేకపోతోంది.. ఇక ఈ సినిమా ద్వారా అనుష్క విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎవరు చేయలేని సాహసం చేసింది అంటూ అందరి చేత మన్ననలు కూడా పొందింది.
ఇకపోతే 2017వ సంవత్సరంలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించారు.. ఈ సినిమాను ఒకే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడం జరిగింది.. తమిళ్ లో ఇంజి ఇడుప్పజగి సినిమా టైటిల్ తో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో విడుదల చేశారు.. ఈ సినిమాలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ ,ఊర్వశి, ఆర్య, శ్రీనివాస్ రెడ్డి , సోనాల్ చౌహన్ వంటివారు సహాయక పాత్రలు పోషించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతే కాదు ఈ సినిమా తెలుగు, తమిళ్ లో మంచి విజయాన్ని అందుకోవడంతో ఒడియా లో కూడా ఛాటీ టేల్ డింగ్ డాంగ్ గా రీమిక్స్ చేయబడింది.. మొత్తానికి అనుష్క సినీ కెరీర్ లో కూడా ఈ సినిమా మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: