వినూత్న రీతిలో పబ్లిసిటీ చేస్తున్న మారుతి..!

Pulgam Srinivas
తెలుగులో లవ్ ప్లేస్ కామెడీ సినిమాలను తెరకెక్కించే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మారుతి, తన సినిమాలను జనాల్లోకి చాలా వైవిధ్యంగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి, ఆ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న పద్ధతిలో ప్రమోషన్ లను నిర్వహించారు. ఈ రోజుల్లో సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లు జనాలను ఎంతగానో ఆకర్షించే విధంగా బయటకు తీసుకువచ్చే సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచి సినిమా థియేటర్ల దాక జనాలను తీసుకువచ్చేలా చేశాడు. మరియు ఆ సినిమా కూడా జనాలను ఆకట్టుకునే విధంగా ఉండటంతో మారుతికి దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. అలా తెలుగునాట మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత కూడా ఆ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బస్ స్టాప్, బలే బలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం, ప్రతి రోజు పండగే వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా హాట్ బ్యూటీ రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా గోపీచంద్ తో ఒక పవర్ఫుల్  సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి దానితోపాటే పేపర్ బాయ్ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చి, ఏక్ మినీ కథ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న మంచిరోజులు వచ్చాయి అనే సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రమోషన్ లో భాగంగా మారుతి కొత్తరకం పద్ధతిని ఎంచుకున్నాడు. ప్రమోషన్ లో భాగంగా మంచిరోజులు వచ్చాయి మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ ఘోష్ ఆడియో లీక్ అంటూ MTV మారుతి టీవీ ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. అజయ్ ఘోష్ కు అప్పడాల విజయలక్ష్మి అనే మహిళ ఫోన్ కాల్ చేయడం. మారుతి డైరెక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతుంది అని తెలిపింది. తనను కూడా మూవీ కి తీసుకెళ్ళమని డిమాండ్ చేయడం ఇలా వీళ్లిద్దరి మధ్య సంభాషణ తో వచ్చిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా మారుతి వినూత్న రీతిలో తన సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: