ఒక్క పాటలో గాంధీ గొప్పతనం తెలిపిన సిరివెన్నెల...

NIKHIL VINAY
కృష్ణ వంశీ తీసిన సూపర్ హిట్ సినిమాల్లో మహాత్మా  ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.అందులో ముఖ్యంగా గాంధీ మీద పక్క మాస్ సినిమా తీసి కృష్ణ వంశీ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక పక్క రౌడి గాంధీ ఫాలోవర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ. శ్రీకాంత్ తన వందోవ చిత్రంగా ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడం నిజంగానే విశేషం అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఇంట్రావెల్ దగ్గర వచ్చే గాంధీ పాట అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ముందుగా ఈ పాటని ఇందిరమ్మ ఇంటి పేరు అని ఉండేది కానీ తర్వాత కొంతమంది సొంత పేరు అని మార్చారు.

 ఈ పాటని రచించిన సిరివెన్నెల గారు మహాత్మా గాంధీ గొప్పతనాన్ని పాటలో చాలా బాగా చెప్పారు. సినిమా కథని అంత ఈ ఒక్క పాట మారుస్తుంది. మాస్ రౌడి శ్రీకాంత్ పాత్రని గాంధీ గొప్పతనం వైపు మళ్ళిస్తుంది ఈ పాట. పాటలో లిరిక్స్ గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే. ప్రతి అక్షరం మహాత్మా గాంధీ ఎంత గొప్పవారో అర్థం అయ్యేలా చేస్తుంది. మనం ఇప్పుడు వింటున్న గాంధీ కాదు అసలైన గాంధీ ఏం చేసాడో ఎలా స్వంతంత్రాన్ని మనకు తీసుకొచ్చారో అద్భుతంగా సిరివెన్నెల గారు లిరిక్స్ లో తెలిపారు.కృష్ణ వంశీ తీసిన ఖడ్గం , మహాత్మా సినిమాల్లో ఆయనకి దేశం మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

గాంధీయతత్వాన్ని మనకు అర్థం అయ్యేల మహాత్మా సినిమాలో కృష్ణవంశీ చూపించారు. ఈ సినిమాలో ఈ పాటకి అప్పట్నుంచి ఇప్పటిదకా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఈ పాట ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండేలా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్పగా ఈ పాటని రాసారు. గాంధీ జయంతి రోజున ఈ పాటని ఒకసారి స్వరించుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: