పూరీ చేసిన సినిమా ఇంత దారుణంగా ఉంటుందా

P.Nishanth Kumar
రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవుడు చేసిన మనుషులు. ఈ ఇద్దరు దర్శక హీరోల కాంబినేషన్ లో తెరకెక్కిన ఐదో సినిమా కావడంతో, వీరి కాంబినేషన్లో వచ్చిన గత నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం అందించగా కేవలం రెండు నెలలలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

అత్యంత తక్కువ కాలంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2012వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలవగా ఈ చిత్రం ఇద్దరి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. అక్షయ తృతీయ రోజున అలిగిన లక్ష్మీదేవిని బుజ్జగించడానికి విష్ణుమూర్తి కధ చెప్పడం ప్రారంభిస్తాడు. హైదరాబాద్ లో పనిచేసే హీరో బ్యాంకాక్ లో అనాదగా పెరిగి టాక్సీ డ్రైవర్ గా పని చేసే హీరోయిన్ ల మధ్య ప్రేమ పుట్టించడానికి ఆ దేవుడు పడే కష్టమే ఈ సినిమా కథ.

ఓ అరటి తొక్క వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం అనేది మంచి పాయింట్ అయినా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయం లో పూరి జగన్నాథ్ శ్రద్ధ చూపించక పోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శ్రీ మహావిష్ణువు గా బ్రహ్మానందం, లక్ష్మీ దేవి గా కోవై సరళ సినిమా ను కొంతవరకు ముందుకు తీసుకు వెళ్లారు. కానీ ఇతర పాత్రలు అత్యంత దారుణంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా బ్యాంకాక్ నగరంలోనే జరిగింది. 90% పాత్రలకు ఆయా పాత్రధారుల అసలు పేరు పెట్టడం తెలుగు సినిమా చరిత్ర లోనే ఇదే మొదటిసారి. మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించిన కూడా ఈ సినిమా తరువాత కాలంలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయి భారీ డిజాస్టర్ గా మిగిలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: