ఆ భామలతో బంగార్రాజు..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలలో హీరోయిన్ లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో భాగంగానే నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా ఎంత మంది హీరోయిన్లతో నాగార్జున ఆడి పాడాడో మనందరికీ తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన  సినిమాలో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాటి మెయిన్ హీరోయిన్ లుగా నటించగా అనసూయ హంస నందిని ప్రముఖ పాత్రలలో కనిపించి మరింత గ్లామర్ ను ఆడ్ చేశారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా అదే రేంజ్ లో గ్లామర్ విందు ఉండేలా బంగార్రాజు చిత్ర బృందం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో స్వర్గం సెట్ వేసి అందులో చిత్రీకరణ చేస్తున్నట్లు మనకు ఇప్పటికే తెలిసిందే.

 అయితే ఈ సినిమాలో స్వర్గం లో ఉండే రంభ , ఊర్వశి , మేనక పాత్రల కోసం కొంతమంది హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే నాగార్జున సినిమా లో ఎప్పుడు ట్రెండ్ లో ఉన్న హీరోయిన్ లను తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ సినిమా కోసం కాస్త భిన్నంగా ప్రస్తు తం ట్రెండ్ లో లేని హీరోయిన్లను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంభ , ఊర్వశి , మేనక అని పిలుచుకునే ఈ మూడు పాత్రల కోసం హీరోయిన్ వేదిక.. దూకుడు ఫేమ్ ఐటమ్ గర్ల్ మీనాక్షి దీక్షిత్ ను తీసుకున్నట్లు , బెంగాలీ బ్యూటీ దర్శన బానిక్ లను తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న పాత్రలే అయిన ఈ ముగ్గురు నటించిన రెండు పాటలు హైలైట్ కానున్నాయని తెలుస్తుంది. మరి ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమా రేంజ్ లో హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: