ల‌వ్ స్టోరీ లీక్స్ :శేఖ‌ర్ - వేటూరి - మిట్ట‌ప‌ల్లి కూడా!

RATNA KISHORE

సినిమా సాహిత్యం వేరు ప్ర‌జా సాహిత్యం వేరు. పాట‌ల ఉర‌వ‌డిలో ఒక్కొక్క‌రూ ఒక్కో శైలిని అనుస‌రిస్తారు. త‌మ‌దైన అర్థం చెబుతా రు. ఈ క్ర‌మంలో వేటూరి అనే గొప్ప క‌వితో శేఖ‌ర్ ప‌నిచేశారు. ఆనంద్ ,గోదావరి , లీడ‌ర్  లాంటి చిత్రాల‌కు మంచి సాహిత్యం రాయించారు. గొప్ప సాహిత్యం అని కూడా అనొచ్చు. త‌ప్పేంలేదు. శేఖ‌ర్ సినిమాల్లో శుద్ధ సంప్ర‌దాయ సంగీతం త‌ప్ప‌క వినిపిస్తుంది. వ‌ర్షం నేప‌థ్యంలో ఒక పాట ఉండాలి. కొన్ని స‌న్నివేశాలు హృదంగా ఉంటే ఇంకా మేలు అని భావించేవాడు శేఖ‌ర్. గొప్ప భావ‌కుడు అని చెప్పేందుకు కొన్ని స‌న్నివేశాలు గోదావ‌రిలో బాగా తీశారు. విజ‌య్ సి కుమార్ ఫొటోగ్ర‌ఫీ అందుకు తోడు.అందుకే పాట‌ల‌ను దృశ్య‌మానం చేసేట‌ప్పుడు ఆయ‌న వేటూరి సాహిత్యాన్ని విని ఒక‌టికి ప‌ది సార్లు విని పొంగిపోయేవారు. ఓ విధంగా శేఖ‌ర్ గోదావ‌రి పాట‌లు అన్నీ విజువ‌ల్ వండ‌ర్సే! త‌న సినిమాలో ప్ర‌తి పాట‌కూ ఓ చోటు నిబ‌ద్ధ‌త‌తో కూడిన స‌రళి ఉంటుంది.
అందుకే కేఎం రాధాకృష్ణన్ కానీ, మిక్కీ జే మేయ‌ర్ కానీ ఇప్పుడు ప‌వ‌న్ కానీ అంత పేరు తెచ్చుకున్నారు. చిరు కూడా ఆ పాట‌లు విని ఎంత మెచ్చుకున్నారో! బాలు కూడా ఓ సంద‌ర్భంలో వేటూరి సాహిత్యం ప‌దే ప‌దే చ‌దివి పొంగిపోయారు ఓ సారి గోదావ‌రి పాట‌ల గురించి ప్ర‌స్తావిస్తూ! అవును! గోదావ‌రి సినిమా టైటిల్ సాంగ్ పాడింది ఆయ‌నే! ఎప్పుడో చ‌దువుకున్న చ‌దువు అయినా , ఇప్పుడు రాయించే పాట అయినా శేఖ‌ర్ కు చాలా చాలా ప్రీతిపాత్రంగానే ఉంటుంది. అవును! అడ‌వి బాపిరాజు సాహిత్యాన్ని గోదావ‌రిలో మ‌ళ్లీ వినిపింప‌జేశాడు. మ‌ల్లీశ్వ‌రి సినిమా రాగ ఛాయ‌ల్లోనే ఫిదాలో పాట ఒక‌టి కంపోజ్ చేయించాడు. ఆయ‌న ఆ పాత మ‌ధురాలు, సుబ్బుల‌క్ష్మి గాత్ర సంబంధ సంకీర్త‌నలు ఇష్టం. అందుకే పాట ప‌ట్టు ప‌ట్టి రాయిస్తారు ఆయ‌న‌.

ఇంత‌వ‌ర‌కూ శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు చాలా అరుదుగా ప్ర‌జా సాహిత్యం రాసిన వారు ప‌నిచేశార‌నే చెప్పాలి. గ‌తంలో ఆయ‌న సినిమా పాట‌లు ఎక్కువ‌గా వేటూరి రాశారు. వ‌న‌మాలి రాశారు. ఈయ‌న సినిమా జ‌ర్నలిస్టు. సితార‌లో కొంత కాలం ప‌నిచేశారు. ఆ మాట‌కు వ‌స్తే వేటూరి కూడా సినిమా జ‌ర్న‌లిజం తొలినాళ్ల‌లో చేశారు. ఆ విధంగా ఈ ఇద్ద‌రు తరువాత శేఖ‌ర్ తెలంగాణ క‌వి సుద్దాల అశోక్ తేజ‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మిట్ట‌పల్లి సురేంద‌ర్ కు అవ‌కాశం ఇచ్చారు. రాతి బొమ్మ‌ల్లోన కొలువైన శివుడా.. ర‌క్త బం ధం విలువ నీకు తెలియ‌దు రా అనే పాట‌తో ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఆ పాట మారుమోగి పోయిం ది. కేసీఆర్ ను ఎంత‌గానో ఆలోచింప‌జేసింది. ఆ త‌రువాత ఎన్నో పాట‌లు రాసి, సినిమా సాహిత్యం రాసేందుకు ఇటుగా వ‌చ్చారు. ధైర్యం సినిమాతో అరంగేట్రం చేశారు. ఈ సారి శేఖ‌ర్ పిలిచి ఈ అవ‌కాశం ఇచ్చారు. నీ చిత్రం చూసి చిత్త‌రువైతిర‌య్యో అంటూ రాశా రు ఓ పాట ఈ ల‌వ్ స్టోరీ చిత్రానికి... ఈ పాట కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే మంచి వ్యూస్ ను కూడా ద‌క్కించు కుంది. ఈ పాట‌ను అను రాగ కుల‌క‌ర్ణి ఆల‌పించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: