విలనిజానికి విలక్షణ నటుడు సోనూసూద్...

VAMSI
సినిమాకి హీరోనే ప్రధాన పాత్ర దారుడు. సినిమాకి హీరో ఎంత అవసరమో అలాగే విలన్ కూడా అంతే ముఖ్యం. ఆ హీరో యొక్క హీరోయిజం తెలియాలి అన్నా, అతడి విలువ, క్రేజ్ అమాంతం పెరగాలన్నా అతని ఢీకొట్టే విలన్ ఉండాల్సిందే. ఆ విలన్ ను ముప్పు తిప్పలు పెట్టి గెలిచినప్పుడు మన హీరో హైప్ అలా పెరిగిపోతుంది. విలన్ పాత్రలో నటించడం అంటే ఆషామాషీ విషయం కాదు. మంచి కటౌట్ అంతకు మించి కంటెంట్ ఉండాలి, యాక్షన్ లో దమ్ముండాలి అప్పుడే ఆ నటుడు విలన్ పాత్రలలో ప్రేక్షకుల్ని మెప్పించగలడు. టాలీవుడ్ లో ఎంతో మంది నటులు విలన్ గా నటించి అలరించిన వారున్నారు. అయితే హ్యాండ్సమ్ లుక్ తో విలనిజాన్ని100 పర్సంట్ పండించే పాత్రకు నటుడు కావాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో సోను సూద్ పేరు ఉండనే ఉంటుంది.
బాలీవుడ్ విలక్షణ నటుడు సోను సూద్ ఇటు తెలుగులోనూ తన సత్తా చాటాడు. తాను నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ అందుకోవడంలో సోను ముఖ్య భూమిక పోషించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.  ఇక ఈయన విలన్ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచిన సినిమాలు ఒకసారి చూసుకుంటే. సూపర్, చంద్రముఖి, అతడు, అరుంధతి, కందిరీగ, దూకుడు, జులాయి, అభినేత్రి వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ లు అందుకోవడంలో  ముఖ్య పాత్రదారుడయ్యాడు. అందులోనూ అరుంధతి చిత్రంలో సోను సూద్ నటించిన పశుపతి పాత్ర అయితే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకి అవార్డులను కూడా అందుకున్నాడు.
పశుపతి పాత్ర సోను సూద్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అన్నంతగా మెప్పించారు. కందిరీగ చిత్రంలో విలనిజంలో కామెడీని పండించి తనలోని మరో యాంగిల్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు సోను. సైలెంట్ కిల్లర్ లా ఉండే అతడి నటనను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. సోనూసూద్ కరోనా సమయంలో చేసిన సేవలను మరచిపోలేము. ఇప్పుడు ఈ సహాయక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విలన్ కాస్తా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఆచార్య, అలాగే తమిళ్ లో ఒక మూవీ, హిందీలో ఒక మూవీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: